Begin typing your search above and press return to search.
జనసేనకే అంత తొందరెందుకో సామీ !
By: Tupaki Desk | 15 May 2023 10:24 AM GMTకొత్త పార్టీ. నవ యువ పాటీ. నడ్డి జారలేదు, ఒడుదుడుకులు ఇంకా ఎక్కువగా చూడలేదు. జనాలకు ఫ్రెష్ లుక్ ఇస్తూ రాజకీయాల్లో తన వాటా చేయి పెట్టి మరీ లాక్కోవాల్సిన పార్టీ అది. అదే జనసేన. నిజానికి రాజకీయాల్లోకి వచ్చే కొత్త పార్టీలు అప్పటిదాకా ఉన్న పార్టీలకు తాము భిన్నమని చెప్పుకుంటాయి. ఆయా పార్టీల మకిలిని అంటించుకోకుండా జాగ్రత్తపడతాయి.
వారి మీద జనాలకు ఉన్న విసుగు, చికాకు, ఇబ్బంది అనీ తమ మీద రిఫ్లెక్ట్ కాకుండా చాలా జాగ్రత్తపడతాయి. అదేంటో కానీ జనసేన మాత్రం ఓల్డ్ పార్టీల బ్యాగేజి నెత్తి మీద పెట్టుకుని మరీ మోయాలని అనుకుంటోంది. తెలుగుదేశం, బీజేపీ కంటే కూడా పొత్తుల మీద కొత్త కోయిల మాదిరిగా ఒకటికి పదిసార్లు కూస్తోంది. ఆరాటపడుతోంది. ఆత్రుత పడుతోంది.
సరిగ్గా ఏణ్ణర్ధం క్రితం అంటే 2022 మార్చి 14న ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభలో పొత్తుల మీద పవన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది లగాయితూ అటు పవన్ అయినా ఇటు నాదెండ్ల అయినా మాట్లాడితే చాలు పెదాల మీద పొత్తుల మాటలు అలా దొర్లుతూనే ఉంటున్నాయి. మాట్లాడితే చాలు తెలుగుదేశం, బీజేపీలతో తాము పొత్తు పెట్టుకుంటామని చెబుతున్నారు.
ఇక్కడ తమాషా ఏంటి అంటే ఆ రెండు పార్టీలూ పొత్తుల మీద పెద్దగా రియాక్ట్ కావడంలేదు అంత దాకా ఎందుకు ఇటీవల మంగళగిరిలో వరసగా రెండు రోజుల పాటు పవన్ మీడియాతో సొంత పార్టీ నాయకులతో మాట్లాడుతూ పొత్తు ఉండాల్సిందే పొత్తులు ఖాయమంటూ కుండ బద్ధలు కొట్టినా కూడా టీడీపీ నుంచి నో సౌండ్.
పొత్తుల విషయంలో నిజానికి అవతల పార్టీలు రియాక్టు అవుతున్నాయా లేదా అన్న ఊసూ ధ్యాసా లేకుండా అదే పనిగా జనసేన మాట్లాడడంతోనే రాజకీయంగా చర్చకు తావిస్తోంది. నిన్నటిదాకా పొత్తుల మీద పవన్ ఊదరగొడితే ఇపుడు నాదెండ్ల మనోహర్ తన వంతు అన్నట్లుగా మాట్లాడుతున్నారు.
ఆయన పొత్తులు ఉంటాయి. కచ్చితంగా జనసేన బీజేపీ టీడీపీలతో కలసి వస్తామని అన్నారు. అవసరం అయితే ఆయా పార్టీలను ఒప్పిస్తామని మాట్లాడుతున్నారు. ఈ పొత్తులు అన్నీ కూడా ప్రజల కోసమే అని కూడా చెబుతున్నారు. ఇక మరో మాట పాత మాటే ఆయన అంటున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటుని అసలు చీలనివ్వమని చెబుతున్నారు.
మా పొత్తులు ఏపీకి మేలు జరిగేలా ఉంటాయని అంటున్నారు. ఇక బీజేపీతో చంద్రబాబులతో చర్చలు జరిపామని, సీట్ల ప్రస్థావన అయితే ఎక్కడా రాలేదని ఆయన అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అవినీతి రహిత పారదర్శక పాలన తెస్తామని అంటున్నారు.
దీంతో మరీ ఇంత అయోమయం ఏంటి బాబూ అనాల్సి వస్తోంది. ఒక వైపు పవన్ పొత్తులు కుదుర్చుకుని ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నారు, ముఖ్యమంత్రి సీటు కోరమని అంటున్నారు. అన్నీ అక్కడే ఉండి విన్న నాదెండ్ల మాత్రం పొత్తులు అంటూనే పవన్ నాయకత్వం అంటున్నారు. దీంతో దీని భావమేని మనోహరా అనాల్సి వస్తోంది
అయినా పొత్తుల కోసం ఇన్ని సార్లు మాట్లాడితే ఇంతలా మీడియా ముందున పడితే రేపటి రోజున ఎటు నుంచి ఏమి జరిగినా నగుబాటు తప్పదు కదా అన్న మాట వినిపిస్తోంది. జనసేన పొత్తుల విషయం లో ఒక ప్రతిపాదన పెట్టింది తెలుగుదేశం నుంచి స్పందన ఉండాలి కదా. అది చూసుకోకుండా తెల్లారి లేస్తూనే పొత్తులు అంటూ మాట్లాడితే జనాలు ఎలా రిసీవ్ చేస్తుంటారో కదా అన్నదే అసలైన పాయింట్ మరి.
అయినా పొత్తులు అవసరం అయి ఉండవచ్చు కాక అయినా ఇంతలా బయటపడిపోవడం, తొందరపడిపోవడం సిసలైన రాజకీయం అనిపించుకుంటుందా అన్నది కూడా ఆలోచించాలని అంటున్నారు. ఏణ్ణర్ధం క్రితం నుంచి జనసేన పొత్తు పొడుపు పాట పాడుతున్నా కొత్తగా అడుగులు పడలేదు కదా అన్నాది కూడా మరో పాయింట్. తెలుగుదేశం బీజేపీ కూడా సరైన సమయంలోనే రియాక్ట్ కావాలని చూస్తున్నట్లుగా ఉంది కాబట్టి కాస్తా పొత్తుల రాగాలాపన పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద ఆలోచిస్తే బెటర్ కదా గురూ అన్న సందేశం అయితే వస్తోంది మరి.