Begin typing your search above and press return to search.

ఉత్త‌రాంధ్ర‌పై ప‌ట్టు పెంచుతున్న జ‌న‌సేన‌... !

By:  Tupaki Desk   |   12 Dec 2022 11:30 PM GMT
ఉత్త‌రాంధ్ర‌పై ప‌ట్టు పెంచుతున్న జ‌న‌సేన‌... !
X
జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఉత్త‌రాంధ్ర‌పై మ‌రింత ప‌ట్టు పెంచుతున్నారు. ఇప్ప‌టికే ఇక్క‌డి విజ‌య‌న‌గ‌రంలో ఇటీవ‌ల కొన్నాళ్ల కిందట స‌భ పెట్టిన ఆయ‌న స్థానిక స‌మ‌స్య‌ల‌పై వైసీపీ దృష్టి పెట్ట‌డం లేద‌ని విమ‌ర్శించారు.

ముఖ్యంగా వ‌ల‌స‌లు.. కిడ్నీ బాధితుల ప‌క్షాన తాను గ‌తంలో చేసిన పోరాట ఫ‌లిత‌మే అంతో ఇంతో ప్ర‌భుత్వం ప‌ట్టించుకుంద‌ని చెబుతూ వ‌స్తున్నారు. అయితే.. ఇప్పుడు పూర్తిస్థాయిలో జ‌న‌సేన అధినేత ఉత్త‌రాంధ్ర జిల్లాల‌పై మ‌రింత ఫోక‌స్ పెట్టాల‌ని నిర్ణయించుకున్న‌ట్టు తెలుస్తోంది.

తాజాగా సోమ‌వారం.. శ్రీకాకుళంలో యువ శ‌క్తి పేరిట ఒక కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న వీడియో సందేశం ఇస్తార‌ని పార్టీ నాయ‌కులుచెబుతున్నారు.

అయితే.. విజ‌య‌వాడ‌, క‌ర్నూలు వంటి బ‌ల‌మైన ప్రాంతాలు ఉండ‌గా.. కేవ‌లం శ్రీకాకుళంపైనే ఎందుకు పోక‌స్ పెంచారంటే.. ఉత్త‌రాంధ్ర‌లో పార్టీకి ఆదరణ పెరుగుతోంద‌ని అంటున్నారు. దానిని మరింత బలోపేతం చేయడానికి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.

గ‌త 2019 ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో ప‌డిన ఓట్ల‌ను చూసుకుంటే ఉత్త‌రాంధ్ర జిల్లాలోనే జ‌న‌సేన‌కు ఎక్కువ‌గా ఓట్లు ప‌డ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5.6 శాతం ఓట్లు ప‌డితే.. ఉత్త‌రాంధ్ర‌లో మాత్రం 6.7 కొన్ని చోట్ల 7 శాతం ఓట్లు ప‌డ్డాయ‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఉత్త‌రాంధ్ర జిల్లాల‌పై ద్రుష్టి బాగుంటుంద‌నే అభిప్రాయంతో ప‌వ‌న్ ఉన్నార‌ని అంటున్నారు.

ఇక‌, ఇక్క‌డ మెగా అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా ఎక్కువ‌గా ఉండ‌డం, అనేక ప్రాంతాలు వెనుక‌బ‌డి ఉండ‌డం, కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌లు, వంశ‌ధార పున‌రావాస బాధితులు.. ఇలా అనేక రూపాల్లో ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చే స‌మ‌స్య‌లు కూడా ఉండ‌డంతో ఉత్త‌రాంధ్ర‌ను అడ్డాగా చేసుకుని పుంజుకునేందుకు అన్ని వైపుల నుంచి బాగుంటుంద‌నే త‌లంపుతో ప‌వ‌న్ అడుగులు వేస్తున్నార‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.