Begin typing your search above and press return to search.
మీ నాన్ననే ఎదుర్కొన్నానయ్యా… మూడు ముక్కల ముఖ్యమంత్రీ: పవన్ పంచ్‌లు
By: Tupaki Desk | 12 Jan 2023 2:38 PM GMTశ్రీకాకుళం వేదికగా జరిగిన యువశక్తి వేదికగా పవన్ కళ్యాణ్ సీఎం జగన్‌పై పంచ్‌లు రువ్వారు. ``మీ నాన్ననే ఎదుర్కొన్నానయ్యా.. మూడు ముక్కల ముఖ్యమంత్రీ`` అని వ్యాఖ్యానించారు. పంచలూడదీసి కొడ్తా అని చెప్పానని, ఎవరికీ బయపడబోనని చెప్పారు. తాను అన్నింటికీ తెగించి రాజకీయాల్లోకివచ్చానని చెప్పారు. పోతే ప్రాణమే కదా పోతుంది.. అయినా లెక్కలేదన్నారు.
సంబరాల రాంబాబొకడున్నాడు.. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే.. నా గురించి మాట్లాడుతున్నాడు. నేను గెలవలేదు. కానీ, ప్రజలు నావెంట ఉన్నారు. ముదురు ముఖమేసుకుని.. అటిన్ రాజాలూ.. రాణీలూ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కానీ, వారి సొంత నియోజకవర్గాల్లోనే వారికి వ్యతిరేకంగా జెండాలు లేస్తున్నాయని చెప్పారు.
అన్ని కులాలూ బావుండాలిరా సన్నాసుల్లారా.. అని వ్యాఖ్యానించారు. ఖైదీ నెంబర్ 6093(జగన్) నా గురించి మాట్లాడితే ఎట్లా..? అని నిలదీశారు. డీజీపీ గారూ…. మీరు ఒక ఖైదీకి సెల్యూట్ చేస్తున్నారు…! అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం ఇప్పటికైనా.. నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని ప్రజలకు ముఖ్యంగా యువతకు పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర చైతన్యం ఇచ్చిందన్నారు. ఇక్కడి కళాకారులతో తనకు ఎనలేని సంబంధం ఉందన్నారు. ఈ సభను తిట్టడానికి పెట్టలేదన్నారు. ఇక్కడి యువతలో ఆవేదన, ఆందోళన నెలకొన్నాయని చెప్పారు. కొందరికి మాత్రమే పరిమితమైన సంతోషాలు.. ఆనందాలను అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సభ పెట్టినట్టు చెప్పారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.