Begin typing your search above and press return to search.

జ‌న‌సేన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వాటే ల‌క్కీ?

By:  Tupaki Desk   |   4 May 2022 2:49 AM GMT
జ‌న‌సేన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వాటే ల‌క్కీ?
X
ప్ర‌శ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పార్టీ ఎవ‌రిని ప్ర‌శ్నించారో.. ఎప్పుడు ప్ర‌శ్నించారో. అనే విష‌యాల‌ను ప‌క్క‌న ప‌డితే.. ఇప్పుడు ఆయ‌న చాలా ల‌క్కీ బాస్‌! అనే మాట వినిపిస్తోంది. క‌నీసం ఓటు బ్యాంకు, సీటు షేరింగు కూడా లేని జ‌న‌సేన‌ను మూడు పార్టీలు మోస్తున్నాయ‌ని చెబుతున్నారు ప‌రిశీలకులు.

ఈ మూడు పార్టీలు కూడా ప్ర‌త్య‌క్షంగానో.. ప‌రోక్షంగానో.. జ‌న‌సేన‌కు స‌పోర్టు చేస్తున్నాయ‌ని అంటున్నారు. ఒక పార్టీ వ్య‌తిరేకంగా.. జ‌న‌సేన‌ను మోసేస్తోంది. అదే వైసీపీ. అధికార పార్టీ నాయ‌కులు జ‌న‌సేన‌ను అడ్డ‌గోలుగా విమ‌ర్శిస్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల్లో జ‌న‌సేన పై చ‌ర్చ సాగుతోంది.

ఇక‌, ఎప్పుడెప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందామా? అని ఎదురు చూస్తున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా జ‌న‌సేనను ప‌రోక్షంగా స‌పోర్టు చేస్తోంది. అంతేకాదు.. ప‌వ‌న్‌ను ప్ర‌త్యేకంగా పొగుడుతూ. భ‌జ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, మ‌రోపార్టీ బీజేపీ. ఇది కూడా జ‌న‌సేన నెంబ‌ర్ 1 అని.. టీడీపీ , వైసీపీ కంటే నెంబ‌ర్ వ‌న్ పార్టీ జ‌న‌స‌నేన‌ని.. బీజేపీ నాయ‌కులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కీల‌క నాయ‌కురాలు.. పురందేశ్వ‌రి వంటి వారు.. జ‌న‌సేన కోసం.. ప్ర‌త్యేకంగా వ్యాఖ్య‌లు చేస్త‌సున్నారు. ఇలా ఇంత మంది జ‌న‌సేన ను ప్ర‌మోట్ చేయ‌డం అంటే.. ఆ పార్టీకి ల‌క్కీనే క‌దా.. అంటున్నారు ప‌రిశీల‌కులు.

వాస్తవానికి ఏపీలో జ‌న‌సేన పార్టీని తీసుకుంటే.. ఏమాత్రం కేడ‌ర్ లేదు. న‌గ‌ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వ‌ర‌కు కూడా ఎవ‌రూ లేరు. ఇక‌, కీల‌క‌మైన బూత్ లెవిల్లో కూడా ఇదే ప‌రిస్థితి ఉంది. కానీ, జ‌న‌సేన‌కు ఉన్న ఏకైక బ‌లం క్యాస్ట్‌. ఇది గ‌ట్టిగా ఉంది కాబ‌ట్టే.. అంద‌రూ.. జ‌న‌సేన‌కు , జ‌న‌సేనాని ప‌వ‌న్‌కు జేజేలు ప‌లుకుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక‌,.. వైసీపీలో ఉన్న కాపు నేత‌ల‌కు.. ద‌మ్ముంటే.. ఒంట‌రిగా పోటీ చేసి గెల‌వాల‌ని.. స‌వాల్ విసురుతున్నారు. ఎందుకంటే.. జన‌సేన ఒంట‌రిగా పోటీ చేస్తే.. వాళ్ల‌కు లాభం అని. అప్పుడు వైసీపీ గెలుస్తుంద‌ని.. వాళ్ల బాధ‌.

టీడీపీ ఈ సారి ఒంట‌రిగా పోటీ చేస్తే.. ఆ పార్టీకి క‌స్టం అని.. అందుకే.. జ‌నసేన‌కు ఉండే 5 నుంచి 6 శాతం ఓటు బ్యాంకు త‌మ‌కు చేరితే.. వాళ్ల‌సు అధికారంలోకి రావ‌చ్చు అనేది వీళ్ల బాధ‌. ఇక‌, బీజేపీ విష‌యానికి వ‌స్తే.. వాళ్ల‌కు క‌నీసం.. 1 శ‌తం ఓటు బ్యాంకు కూడా లేదు. ఈ సారి.. ఒక శాతం ఓటు బ్యాంకు కూడా రాక‌పోతే.. బీజేపీ హైక‌మాండ్ క‌నీసం.. ఏపీ నేత‌ల‌కు అప్పీయింట్ మెంట్లు కూడా ఇచ్చే ప‌రిస్థితి ఉంద‌ని అంటున్నారు. అందుకే.. జ‌న‌సేన‌ను మోస్తున్నార‌ని.. అప్పుడైనా .. త‌మ‌కు ఓటు బ్యాంకు పెరుగుతుంద‌ని వారు భావిస్తున్నారు.

జ‌న‌సేన అంద‌రికంటే బెస్ట్ అని వాళ్లు జ‌న‌సేన చుట్టూ తిరుగుతున్నారు. మొత్తానికి సింగిల్ సీటు.. ప‌ట్టుమ‌ని ప‌ది మంది నాయ‌కులు కూడా లేని.. ప‌వ‌న్‌ని వాళ్లు భ‌జ‌న‌తో ముంచెత్తుతున్నార‌ని.. అంటున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్నవారు. అందుకే.. జ‌న‌సేన ల‌క్కీ పార్టీ అని వ్యాఖ్యానిస్తున్నారు.