Begin typing your search above and press return to search.
అభిమాని అత్యుత్సాహం.. ఇరుకునపడిన జనసేన పార్టీ
By: Tupaki Desk | 18 July 2020 10:15 PM ISTఓ అభిమాని.. జనసేన పార్టీ వీర భక్తుడు అత్యుత్సాహంతో చేసిన ఓ పని ఆ పార్టీని ఇరుకున పడేలా చేసింది. త్వరలోనే పార్టీ అధినేత జన్మదినం రాబోతోంది.. ఆ నాయకుడికి గిఫ్ట్‌గా మనిషికో రూ.వంద విరాళంగా ఇచ్చి పార్టీ ఫండ్ రూ.200 కోట్లు చేద్దామని పిలుపునిచ్చాడు. ఇది ట్విటర్‌లో పోస్టు చేయడంతో సోషల్ మీడియాలో వైరలైంది. ప్రధాన మీడియాలో కూడా దీనిపై చర్చ మొదలైంది. అయితే ఈ పరిణామం జనసేన పార్టీని ఇరుకున పెట్టింది. ఎందుకంటే గతంలో 2019లో ఈ విధంగా పవన్ కల్యాణ్ పార్టీ పెడుతున్నారు.. చందాలివ్వండి అని కొందరు బ్యాంక్ ఖాతాలు తెరిచి అభిమానులను కోరారు. అయితే వారంతా ఫేక్ అని తెలిసింది. దీంతో ఇప్పుడు అలాంటిది జరగకూడదని జనసేన భావించి ఆ అభిమాని విజ్ఞప్తిని కొట్టిపారేసింది. దీన్ని ఖండించి ఎవరూ విరాళాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది.
జనసేన పార్టీకి విరాళాలు సేకరించాలన్న ఆలోచనతో ఓ జనసేన కార్యకర్త.. పవన్ కల్యాణ్ అభిమాని ట్విటర్‌లో రూ.వంద పార్టీకి విరాళంగా ఇవ్వాలని కోరుతూ ట్వీట్ చేశాడు. దీంతోపాటు పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా రూ.2 కోట్లు ట్వీట్లు చేస్తూనే రూ.వంద పార్టీ కోసం విరాళంగా ఇవ్వాలంటూ కోరాడు. అంటే మొత్తం రూ.200 కోట్లు పార్టీకి విరాళంగా సేకరించాలని అతడి ఉద్దేశం. ఈ ట్వీట్ తెగ వైరలవడంతో పాటు ప్రధాన మీడియాలో కూడా వచ్చింది. ఈ వ్యవహారం జనసేన పార్టీ అధిష్టానం గుర్తించింది. అతడు ఆ విజ్ఞప్తితో పాటు జనసేన పార్టీ బ్యాంకు ఖాతాతో పాటు ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఉన్న ఫొటో కూడా పెట్టాడు.
దీన్ని జనసేన పార్టీ ఖండించింది. జనసేన పార్టీ అభిమానుల నుంచి డబ్బులు సేకరించడాన్ని వ్యతిరేకిస్తుందని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ మెసేజుకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఆ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేయొద్దంటూ అధికారికంగా అభిమానులకు పార్టీ హైకమాండ్ చెప్పలేదు. అయితే ఆ మెసేజ్‌లో ఉన్న బ్యాంకు అకౌంట్ తమదేనని జనసేన ధృవీకరించడం విశేషం.
సెప్టెంబర్ 2వ తేదీన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే విషెస్‌తో ట్విటర్‌లో సరికొత్త రికార్డు సృష్టించాలని జన సైనికులు భావించారు. దీంతో అందుకనుగుణంగా పని చేశారు. అందులో భాగంగానే ఆ అభిమాని జనసైనికులు ఆన్ లైన్ ట్రాన్స్‌ఫర్స్ చేయడం నేర్చుకోవాలంటూ కోరాడు.