Begin typing your search above and press return to search.

2019 ఎన్నికలు- వ‌న్ ది క్లారిటీనా? కన్ఫ్యూజనా?

By:  Tupaki Desk   |   2 Oct 2017 11:25 AM GMT
2019 ఎన్నికలు- వ‌న్ ది క్లారిటీనా? కన్ఫ్యూజనా?
X
జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అభిమానుల‌కు, పార్టీ శ్రేణుల‌కు 2019 ఎన్నికల్లో పోటీ చేయ‌డం గురించి త‌న అభిప్రాయం వెల్ల‌డించారు. ఎప్ప‌ట్లా త‌న వ్య‌క్తిగ‌త‌ ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా కాకుండా జ‌న‌సేన పార్టీ ఖాతా ద్వారా జ‌న‌సేనాని వివ‌రాలు వెల్ల‌డించారు. అయితే రాబోయే ఎన్నిక‌ల్లో పోటీ గురించిన సమాచారం తెలియ‌జేసిన‌ప్ప‌టికీ అది అస్ప‌ష్ట‌త‌ను క‌లిగించే రీతిలో ఉంద‌ని అంటున్నారు. ఇంతకీ ప‌వ‌న్ ఏం చెప్పారంటే...2019లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు రాష్ర్టాల్లోని 175 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. కేవ‌లం 175 స్థానాలను మాత్ర‌మే పేర్కొన‌డం గురించి స్వ‌యంగా ఆయ‌నే వివ‌ర‌ణ ఇస్తూ...త‌మ పార్టీ బ‌లం ఉన్నంత మేర‌కు పోటీ చేస్తుంద‌ని వివ‌రించారు.

ఇటీవ‌ల జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌ను వేగ‌వంతం చేసిన జ‌న‌సేన అధినేత తాజాగా త‌న పొలిటిక‌ల్ జ‌ర్నీ గురించి స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఈ క్ర‌మంలో 175 స్థానాలు అంటూ రెండు రాష్ర్టాల్లోనూ జ‌న‌సేన‌ను బ‌లోపేతం చేస్తామ‌ని ప్ర‌క‌టించేశారు. త‌ద్వారా తన‌ను ఏపీకి మాత్ర‌మే ప‌రిమితం చేయ‌డం స‌రికాద‌ని ప‌రోక్షంగా చెప్పేశారు. తెలంగాణ‌లో కూడా కొద్దికాలం క్రితం పార్టీశ్రేణుల ఎంపిక‌ను జ‌న‌సేన చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎందుకు 175 స్థానాలు మాత్ర‌మే ఎంచుకున్నారు? ఇప్పుడే ఆ స్థానాల గురించి ప్ర‌క‌ట‌న ఎందుకు చేయాల్సి వ‌చ్చింది. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో బ‌లం పెంచుకొని పోటీ చేయ‌వ‌చ్చు క‌దా అనే సందేహాలు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు త‌న జ‌న్మ‌దిన సంద‌ర్భంగా దుబాయ్‌, బెంగళూరు స‌హా వివిధ ప్రాంతాల్లో ఉన్న జనసేన అభిమానుల ప్రశ్నలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమాధానమిచ్చిన అప్పుడు సైతం పోటీపై స్పందించిన సంగ‌తి తెలిసిందే. ``2019 ఎన్నిక‌ల్లో`ఒంటరిగా పోటీ చేయాలా..? కలిసి పోటీ చేయాలా..? అన్నదానిపై పార్టీ బలం తెలుసుకున్నాకే నిర్ణయిస్తా`` అని పవన్‌ వెల్లడించారు. బలం ఉంటే తెలంగాణ సహా ఏపీ మొత్తం ఒంటరిగా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ఎంత బలం ఉంటే అంత పోటీ చేద్దామని, ఇందులో సీక్రెట్‌ ఏమీ లేదని ప‌వ‌న్ ఆ స‌మ‌యంలో స్పష్టం చేశారు.