Begin typing your search above and press return to search.
'వైసీపీ నుంచి ఏపీని కాపాడుతాం.. అందుకే పవన్, చంద్రబాబు చర్చలు'
By: Tupaki Desk | 30 April 2023 1:47 PM GMTఆంధ్రప్రదేశ్‌ను అన్ని రకాలుగా అభివృద్ధికి దూరం చేసిన వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి కలిగించే తమ లక్ష్యమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య మరిన్ని సమావేశాలు జరగబోతున్నాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ పాలన నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విముక్తం చేయడానికి జనసేన పార్టీ కట్టుబడి ఉందని.. దీని కోసం కచ్చితంగా వైసీపీ వ్యతిరేక పక్షాలన్నీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి అన్నదే జనసేన అభిమతమని.. అందులో భాగంగానే రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ విధానాలపై చర్చించేందుకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ జరిగింద'ని నాదెండ్ల చెప్పారు. ఆదివారం ఉదయం విశాఖపట్నంలో నాదెండ్ల మీడియాతో మాట్లాడారు.
"వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు అత్యుత్తమ ప్రత్యామ్నాయం కోసం జనసేన పార్టీ ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు మేలు జరిగే పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాళ్లలో అందించేందుకు జనసేన పార్టీ కట్టుబడి ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయబోమని, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పని చేస్తామని చెప్పారు. దానిలో భాగంగానే రాజకీయ భేటీలు ఉంటాయి. ఇవి భవిష్యత్తులోనూ జరుగుతాయి. ఒక ప్రణాళిక, వ్యూహంతో అభివృద్ధి పంథాలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించేలా మా అడుగులు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ మా మిత్రపక్షం. కచ్చితంగా రాజకీయంగా దానిని పాటిస్తూ ముందుకు వెళ్తాం’ అన్నారు.
''ఉత్తరాంధ్రలో అపారమైన మానవ వనరులు, సహజ వనరులు ఉన్నాయి. ఇప్పటి వరకు పాలకులు చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఇక్కడ అభివృద్ధి కుంటుపడింది. వలసలు పెరిగిపోయాయి. అద్భుతమైన సహజ వనరులను అడ్డగోలుగా దోపిడీ చేశారు. వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంపై చూపుతున్న ప్రేమ కేవలం కపట నాటకం మాత్రమే. ఇక్కడ భూములపై కన్నేసిన వైసీపీ నాయకులు వాటిని దోచుకోవడం కోసమే కొత్త నాటకాలకు తెర తీశారు. నిషేధిత భూముల్లో అక్రమ కట్టడాలు, కనిపించిన ప్రతి జాగా ఆక్రమించుకోవడం ఇప్పటికే పెరిగిపోయింది. ఈ భూముల దోపిడీని అధికారికం చేసేందుకే వైసీపీ ప్రభుత్వం తాపత్రయపడుతోంది. జనసేన పార్టీ పూర్తి స్థాయి ప్రణాళికను, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై స్పష్టమైన అభివృద్ధి విజన్ తో ప్రత్యేక మేనిఫెస్టో అందిస్తాం. కచ్చితంగా ఉత్తరాంధ్ర పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేలా జనసేన పార్టీ ప్రయత్నం చేస్తుంది.ఉత్తరాంధ్రలోని జిల్లాల్లో జనసేన పార్టీ సంస్థాగతంగా బలం పుంజుకుంటోంది. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో మండల, గ్రామ. కమిటీల నియామకం పూర్తి అయ్యింది. జనసేన పార్టీ ఉత్తరాంధ్ర లో పూర్తిస్థాయిలో రాజకీయంగా సన్నద్ధం అయ్యింది.
వైసీపీ విశాఖలో భూదందాలు సాగిస్తోంది. రుషికొండ నుంచి చర్చి భూముల వరకూ అన్నింటినీ దోచేస్తున్నారు. విశాఖలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా సామాన్యుల ఆస్తులు కొల్లగొడుతున్నారు. విజయనగరం జిల్లాలో ఒక వృద్ధురాలుకి చెందిన 80 సెంట్ల భూమిని లాక్కొని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనే విషయం మా దృష్టికి వచ్చింది. మేం అధికారంలోకి వచ్చాక భూ దందాలు, అక్రమ నిర్మాణాలు.. వాటి అనుమతులపై కచ్చితంగా రివ్యూ చేస్తాం’ అన్నారాయన.
''రాష్ట్రంలో ఏ పని చేసినా దానిలో రాజకీయ కోణం, ఉపయోగాన్ని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది. ప్రజలకు ఏ పని ఉపయోగపడుతుంది, వారికి ఏది అవసరం అన్నది మాత్రం వైసీపీకి పట్టడం లేదు. ఓ పని చేస్తే రాజకీయంగా ఎంత మేర లబ్ధి కలుగుతుంది అన్నది బేరీజు వేసుకొని మాత్రమే పనులు చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో అభివృద్ధి పనులు పూర్తిగా కుంటు పడిపోయాయి. కేంద్ర ప్రభుత్వం పీఎంఈవై పథకంలో భాగంగా గత ఏడాది 95,000 ఇల్లు కేటాయిస్తే, వైసీపీ ప్రభుత్వం కేవలం 55 నిర్మించడం అంటే వైసీపీ ప్రభుత్వం ఎలా పని చేస్తుందో అర్థం అవుతుంది. పాలనలో ఘోరంగా ఈ ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. కనిపించిన ఇసుక, కొండలు, గుట్టలు, మట్టి ఇలా ప్రతిదీ దోచుకుపోతున్నారు. ఉత్తరాంధ్రను పూర్తిగా దోచుకోవడం కోసం మాత్రమే వారు వస్తున్నారు తప్పితే.. అభివృద్ధి కోసం కాదు.
విశాఖపట్నం మాకాం మారుస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికీ పలుమార్లు చెప్పారు. జనవరి, మార్చి, అయిపోయింది.... ఇప్పుడు సెప్టెంబర్ లో విశాఖపట్నంలో కాపురం పెడతానని చెబుతున్నారు. అదే విషయాన్ని మీడియా ముఖంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పవచ్చు కదా..? అది ప్రజలకు నేరుగా చేరుతుంది కదా..? ప్రజలను కేవలం మభ్యపెట్టడానికి మాత్రమే ఈ ముఖ్యమంత్రి పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ కాపురం పెడితే అక్కడ నుంచి పరిపాలన సాగుతుందని ఏ రాజ్యాంగంలో రాసి ఉంది. అలా చెప్పుకోవడం సిగ్గు చేటు. మీకు ఉత్తరాంధ్ర పై ప్రేమ కాదు.. ఇక్కడ వనరులపై కన్ను మాత్రమే ఉంది. ఇప్పటికే ఇక్కడి కీలక భూములను ఎలా కాజేస్తున్నారో ప్రజలకు అర్ధం అయ్యింది. దీన్ని మరింత కొనసాగించి ఈ ప్రాంతంలో కల్లోలం సృష్టించేందుకే వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది’ అని ఆయన ఆరోపించారు.
కాగా చంద్రబాబు, పవన్ మధ్య మరిన్ని భేటీలు జరగబోతున్నాయని నాదెండ్ల చెప్పడంతో వైసీపీ నేతలు అలర్ట్ అవుతున్నారు. ఇద్దరి మధ్య సానుకూల వాతావరణాన్ని చెడగొట్టేందుకు విష ప్రచారాలు మొదలుపెడుతున్నారు.