Begin typing your search above and press return to search.

మాజీ మంత్రుల పుండుమీద కారం చల్లిన నాగబాబు

By:  Tupaki Desk   |   11 April 2022 3:47 PM GMT
మాజీ మంత్రుల పుండుమీద కారం చల్లిన నాగబాబు
X
ఏపీలో మంత్రి పదవుల పందేరం పెనుదుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఓ పక్క మంత్రి పదవి దక్కిన వారు సంతోషంగా సంబరాలు చేసుకుంటుంటే.. అర్హత ఉండి సామాజిక సమీకరణాలు, జగన్ లెక్కల కారణంగా పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో మరికొందరు కూరుకుపోయారు.

మంత్రి పదవి దక్కలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వారు కన్నీరు మున్నీరుగా విలిపించిన వార్తలు మీడియాలో వచ్చాయి. ఇక వైసీపీ అనుచరులు ఆగ్రహావేశాలతో రోడ్డెక్కిన వైనం కూడా వెలుగుచూసింది. వైసీపీలో తమ నేతకు మంత్రి పదవి దక్కలేదని పలువురు ఆందోళన చేశారు. బాలినేని, ఉదయభాను, సుచరిత లాంటి వారు వైసీపీ అధిష్టానాన్నే ఎదురించారు.

ఈ క్రమంలోనే వైసీపీ నేతలు, మంత్రి పదవి దక్కని వారిపై మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు పంచ్ లు వేశారు. 'మంత్రి పదవులు రానివారు, మంత్రి పదవులు పోయిన వారి ఫస్ట్రేషన్, బాధ, కుమిలిపోవడం, కొంతమంది కన్నీరు పెట్టుకోవడం ూస్తే తనకూ బాధేసిందని, ఆయ్యో పాపం అనిపించిందని నాగబాబు అన్నారు. పదవుల కోసం ఏడుస్తున్నా బాధపడుతున్న వైసీపీ నేతలకు నాగబాబు చురకలంటించారు.

ఇక అదే క్రమంలోనే ఏపీలో సమస్యలపైన నాగబాబు ప్రశ్నించారు. కౌలు రైతుల ఆత్మహత్యలు, ఉద్యోగాలు రాని యువత, రాజధాని ప్రజల కడుపుమంట, ఉద్యోగులు పడుతున్న బాధలు, నాశనం అయిపోయిన మౌలిక సదుపాయాలు, ఆ సదుపాయాల్లేక నిత్యం చస్తున్న ప్రజలు, వారు పడుతున్న బాధలపై కన్నీరు, ఫస్ట్రేషన్, బాధ, ప్రేమ చూపిస్తే బాగుంటుందని నాగబాబు విమర్శించారు.

నాగబాబు చేసిన కామెంట్లు మాజీ మంత్రుల పుండు మీద కారం చల్లినట్లున్న నాగబాబు కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చివరకు 'ఏమంటారు వైసీపీ లీడర్స్.. నేను తప్పుగా మాట్లాడి ఉంటే సారీ'  అంటూ నాగబాబు ఎద్దేవా చేయడం విశేషం.