Begin typing your search above and press return to search.

ఎన్నికల బరిలో జన ‘సేన’లు రెడీ

By:  Tupaki Desk   |   23 Jan 2019 6:42 AM
ఎన్నికల బరిలో జన ‘సేన’లు రెడీ
X
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంలో ఆయా పార్టీల అధినేతలు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. చివరి నిమిషంలో అభ్యర్థులు ప్రకటిస్తే గెలుపు అవకాశాలు తక్కువైనందునా అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ముందుగానే ప్రకటించేస్తున్నాయి. అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థుల ప్రక్రియను ఖరారు చేస్తోంది. ఒక ప్రతిపక్ష అధినేత వైసీపీ సైతం తన పాదయాత్రలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు.

ఇక ఇప్పడు జనసేన వంతు వచ్చింది. పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే నాడు జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసేందుకు పవన్ కల్యాన్ ముహుర్తం ఖరారు చేశారని సమాచారం. దీంతో ఆ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.

అధికారంలో పార్టీ టీడీపీ, ప్రతిపక్ష పార్టీలకు దీటుగా జనసేన అభ్యర్థులను ఖరారు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల కమిటీ ఏర్పాటుకు సంబంధించి నివేదికలను ఆయన తెప్పించుకున్నారు. తొలుత కమిటీలను పూర్తి చేసి రిపబ్లిక్ డే రోజున తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు నిర్ణయించారని సమాచారం. ఇతర పార్టీల నుంచి పొత్తు కోసం ఒత్తిడి వస్తున్న తరుణంలో అభ్యర్థులను ప్రకటిస్తే తాను ఎవరితో లేననే స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని పవన్ భావిస్తున్నారు. దీంతో అందరికీ కంటే ముందుగానే తానే తొలి జాబితా విడుదల చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.

తొలి జాబితాలో తూర్పుగోదావరి, గుంటూరు, అనంతరపురం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన ఉండే చాన్స్ ఉంది. జనసేన తొలి అభ్యర్థిగా ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరానికి చెందిన పితాని బాలకృష్ణను ప్రకటించారు. ఇక రాజమహేంద్రవరం రూరల్ నుంచి కందుల దుర్గేష్, తుని నుంచి రాజా అశోక్ బాబు, కాకినాడ రూరల్ నుంచి అనిశెట్టి బుల్లెబ్బాయి. గన్నవరం నుంచి పాముల రాజేశ్వరీ, మండపేల నుంచి దొమ్మటి వేంకటేశ్వర్లు, రాజోలు నుంచి రాపాక వరపరసాద్ పేర్లు ఉండే అవకాశం ఉంది. వీటితో మరికొన్ని నియోజవర్గాల అభ్యర్థుల లిస్టు ప్రకటించే అవకాశం ఉంది.

ఇక గుంటూరు జిల్లా నుంచి నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్ వంటి పేర్లు తొలిలిస్టులో ఉండే అవకాశం ఉంది. కాగా అనంతపురం నుంచి ఇప్పటి వరకు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజాసేవలో ఉంటున్న ఇద్దరి పేర్లపై పవన్ దృష్టిసారించినట్లు సమాచారం. వీరి పేర్లు కూడా తొలి జాబితాలో ఉండేలా కనిపిస్తుంది. కాగా ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నందునా కొత్త అభ్యర్థులతో పాటు ఇప్పటికే ఎమ్మెల్సేలుగా పనిచేసిన జనసేనలో చేరిన వారి పేర్లు తొలి జాబితాలో ఖరారైనట్లు సమాచారం. ఎప్పడెప్పుడు జాబితా విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న జనసేన ఆశావహులతోపాటు, పవన్ అభిమానులకు ఈ సమాచారం మరింత ఉత్కంఠను రేపుతుంది.