Begin typing your search above and press return to search.
జనసేన మేనిఫెస్టో: విద్యార్థులకు లాప్ టాప్ లు, రైతులకు పింఛన్లు
By: Tupaki Desk | 3 April 2019 8:43 AM GMTజనసేన దూకుడు పెంచింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం పార్టీ ప్రాథమిక మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికలకు ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో తీవ్ర కసరత్తు చేసిన పవన్ ప్రజలను ఆకట్టుకునేందుకు.. ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రజాకర్షక మేనిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం 96 హామీలు, 7 సిద్ధాంతాలతో పవన్ రూపొందించిన ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతులు, మహిళలపై వరాల వాన కురిపించారు.
*పవన్ జనసేన మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు
1. 60 ఏళ్ల పైబడిన రైతులకు రూ.5వేల పెన్షన్లు
2.ప్రతి సంవత్సరం రైతులకు 8వేల పెట్టుబడి సాయం
3.రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రల ప్రాంతాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు
4.కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
5.రాయలసీమను కరువు ప్రాంతంగా ప్రకటించి అక్కడ ప్రజలు, రైతులకు సహాయ కార్యక్రమాలు చేయడం..
6.ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి, మత్స్యకారులు, రైతులకు సరికొత్త వ్యవసాయ పద్ధతులతో సాగును పటిష్టం చేయడం
7. కోనసీమలో అంతర్జాతీయ ప్రమాణాలతో టూరిజం ను అభివృద్ధి చేయడం
8. రైల్వే కారిడార్ల అభివృద్ధి. కాకినాడ నుంచి తెనాలి వయా అమలాపురం, నర్సాపురం, మచిలీపట్నం వరకూ రైల్వే లైన్
9. ఉచితంగా రైతులకు సోలాప్ పంపుసెట్లను ఇవ్వడం..
10. రైతు సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేసి రైతులకు అందులో తమ పంట ఉత్పత్తులను వారి ఇష్టమైన ధరకు పండించుకునేలా ఏర్పాట్లు
11. ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు
12. డిగ్రీ విద్యార్థులకు ఇంక్యూబేషన్ సెంటర్స్
13. యూనివర్సిటీలు, హాస్లళ్లలో అందరికీ రిజర్వేషన్లు కల్పించడం..
14. ఏపీలోని ఒక్కో కుటుంబానికి 10లక్షల ఇన్సూరెన్స్
15.జిల్లా ఆసుపత్రులన్నింటిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చడం
16. ఉచితంగా మొబైల్ రోగాల పరీక్షల కేంద్రాలను ప్రతీ మండలంలో ఏర్పాటు..
17.ఆంధ్రా అసెంబ్లీలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు
18. యువతులకు పెళ్లిళ్లకు 50వేల వడ్డీ లేని రుణాలు
19. ఆడపడుచు కానుకగా 10001 రూపాయల ప్రోత్సాహం
20. మహిళలపై దాడులు, అత్యాచారాల నియంత్రణకు చర్యలు
21. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేసి నేరాల నియంత్రణ
22. పోలీస్ శాఖలోని ఖాళీలను వెంటనే నిరుద్యోగులతో భర్తీ చేయడం..
23.క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారం ప్రతీ సంవత్సరం రెగ్యులర్ గా ప్రభుత్వ ఉద్యోగుల ఖాళీలు భర్తీ చేయడం..
24.సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ పెట్టుబడులు పెట్టి ప్రతీ మండలానికి చెక్ డ్యాం, వాన నీటి నిల్వకు ఇంకుడుగుంతల నిర్మాణం
25.నదుల అనుసంధానం
26. మత్స్యకారులకు 300 రోజులు పని ఉండేలా కల్పన
27.ట్యాంకులు, కాలువలు, నీటి నిల్వ సామర్థ్యాలను రెట్టింపు చేయడం..
ఇలా జనసేన పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇవీ.. అధికారంలోకి వస్తే వీటన్నింటిని అమలు చేస్తామని.. వీటిని చూసిన ఓటేయాలని పవన్ కోరుతున్నారు. మరి ఈ మేనిఫెస్టో పవన్ కు ఓట్ల వాన కురిపిస్తుందా? లేదో మే 23న వెలువడే ఫలితాల్లో చూడాల్సిందే..