Begin typing your search above and press return to search.

ప్రధాన ప్రతిక్షనేత గా జనసేన శాసనసభా పక్ష నేత రాపాక వరప్రసాద్?

By:  Tupaki Desk   |   1 Aug 2020 9:30 AM GMT
ప్రధాన ప్రతిక్షనేత గా జనసేన శాసనసభా పక్ష నేత రాపాక వరప్రసాద్?
X
అమరావతిపై ఫైట్ రసకందాయంలో పడబోతోంది. ఏపీ మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపడంపై ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు పోరుబాటకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సహా 20 మంది ఎమ్మెల్యేలు రేపు గవర్నర్ ను కలిసి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు.

ఇక చంద్రబాబు పోరాటానికి తలొగ్గకూడదని జగన్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. చంద్రబాబుపై ప్రజల్లోనే తేల్చుకోవడానికి రెడీ అవుతోంది. ప్రతిపక్ష చంద్రబాబు సహా 20మంది ఎమ్మెల్యేల రాజీనామాను ప్రభుత్వం కూడా స్పీకర్ ద్వారా ఆమోదింప చేసి ప్రజల్లోనే తేల్చుకోవడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. దీంతో ప్రజాక్షేత్రంలోనే చంద్రబాబును ఎదుర్కోవడానికి వైసీపీ ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు తెలిసింది.

కాగా చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాలతో ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం ఖాళీ అవుతుంది. ఇక అసెంబ్లీ బలం చూస్తే 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉండగా.. 23మంది టీడీపీ ఎమ్మెల్యేలున్నారు. ఇక ఒకే ఒక్క జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఉన్నారు.

ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అవతరిస్తారు. చంద్రబాబు రాజీనామాతో సభలో మిగిలే ప్రతిపక్షం కేవలం జనసేన మాత్రమే అవుతుంది. దీంతో రాపాకకు ఇది గోల్డెన్ చాన్స్ గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. కరోనా తగ్గి ఎన్నికలు జరగాలంటే కనీసం ఆరునెలల సమయం పడుతుంది. దీంతో ఈ ఆరు నెలలు రాపాక వన్ అండ్ ఓన్లీ ప్రతిపక్ష నేతగా ఉండబోతున్నారు.