Begin typing your search above and press return to search.
ఏపీకి కాబోయేది కాపు ముఖ్యమంత్రే... ఇది పక్కా...?
By: Tupaki Desk | 10 Nov 2022 1:30 AM GMTఏపీకి 2024లో ఎన్నికలు ఉన్నాయి. కానీ జరగాల్సిన తంతు చాలా ఉంది. ఇప్పటికే ఏపీలో పొలిటికల్ హీట్ బాగానే రాజుకుంది. దాంతో విపక్షాలు కూడా తమ బలం పెంచుకోవడానికి కొత్త ఎత్తులు వేస్తున్నాయి. జోరు బాగా పెంచేశాయి. ఈ నేపధ్యం నుంచి చూస్తే ఏపీలో రాజకీయ మార్పు అనివార్యం అన్నట్లుగానే సీన్ కనిపిసోంది. 151 సీట్లతో గెలిచిన వైసీపీ మూడు దశాబ్దాల పాటు తమదే అధికారం అని ఢంకా భజాయిస్తోంది.
అయితే ఒక్క చాన్స్ అంటూ అడిగి గద్దె నెక్కి ఇంతలా విద్వంశం చేసి పారేశారు మీకు మల్ళీ ఓటేసేది ఎవరు అంటూ చంద్రబాబు రీసెంట్ గా గర్జించారు. ఎన్నికలు ఎపుడు వచ్చినా విజయం మాదే అని ఆయన అంటున్నారు. ఇక ఎత్తులు పై ఎత్తులు వేయడంతో బాబుని మించిన వారు లేరు. ఆయన ఈ మధ్యనే విజయవాడలో ఒక హొటల్ లో బస చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలసి వచ్చారు. ఇద్దరూ కలసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని చెప్పుకున్నారు.
ఆ తరువాత టీడీపీ జనసేనకు అనుకూలంగా మారిపోయింది. ఏ చిన్న విషయం జరిగినా పవన్ కళ్యాణ్ కే తమ్ముళ్ళు బాహాటంగా మద్దతు పలుకుతున్నారు. ఇక టీడీపీ అనుకూల ఎల్లో మీడియా అయితే పూనకాలు వచ్చేసినట్లుగా పవన్ కవరేజిని ఇచ్చేస్తోంది. గత ఇరవై రోజుల వ్యవధిలో చూసుకుంటే విశాఖ టూ విజయవాడ టూ ఇప్పటం అన్నట్లుగా జనసేనకు మీడియా కవరేజ్ వీర లెవెల్ లో పెరిగింది. ఆ విధంగా పవన్ తమ వాడు అని ప్రోజెక్ట్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతోంది.
అయితే ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే పవన్ కి కవరేజి పెరగడం మద్దతుగా టీడీపీ రావడం ఒక వైపు ఆనందంగా ఉన్న జనసైనికులలో మాత్రం అది వేరే చర్చకు దారి తీస్తోంది. మెల్లగా టీడీపీ ట్రాప్ లోకి జనసేన వెళ్ళిపోతోంది అన్న డౌట్లలో జనసేనను అభిమానించే వారు, కీలక నాయకులు ఉన్నారు. జనసేనకు జనాలలో మద్దతు బాగా పెరుగుతున్న వేళ ఆ మొత్తం ప్రజాభిమానాన్ని తామె సొంతం చేసుకోకుండా టీడీపీతో జట్టు కడితే జూనియర్ పార్టనర్ గా మిగిలిపోతామన్న ఆవేదన వారిలో కలుగుతోంది.
ఇదిలా ఉంటే లేటెస్ట్ గా జనసైనికుల మనోభావాలు తీసుకున్నా లేక ఆ పార్టీని అభిమానించే నాయకులు, సినీ నటుల భావన తీసుకున్నా ఈసారి కాపు ముఖ్యమంత్రి కావాలనే తాము జనసేనకు మద్దతు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా సొంతంగానే పోటీ చేయాలని సూచిస్తున్నారు. ఈసారి జనసేనకు సువర్ణ అవకాశమని కూడా వారు అంటున్నారు.
ఏపీలో టీడీపీని ఎప్పటి నుంచో చూస్తున్నారు. వైసీపీ పాలన కూడా చూసేశారు. ఇక మిగిలింది జనసేన మాత్రమే. జనాలు ఈ కొత్త పార్టీకి కూడా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అలాంటి సమయంలో పొత్తులు అంటూ రాంగ్ స్టెప్ వేస్తే కాపుల చిరకాల కోరిక అన్నది తీరకుండా పోతుందని చెబుతున్నారు. అయితే ఆదికు ముందే పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలుస్తాను అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇపుడు ఆయన టీడీపీతో బంధం కలిపేలా ఉన్నారు.
అయితే దీని మీద కూడా జనసేనలో మరో అభిప్రాయం కూడా ఉంది అంటున్నారు. పొత్తులు పెట్టుకుని రాజకీయ వ్యూహాలకు తెర తీసినా కూడా అది జనసనకు అనుకూలంగా ఉండాలి తప్ప అవతల వారికి మద్దతు పార్టీగా మిగలరాదు అనే చెబుతున్నారు. అలా కనుక చూస్తే అధికారంలో వాటా కోసం జనసేన పట్టుబట్టే అవకాశాలు కచ్చితంగా ఉంటాయని చెబుతున్నారు.
అది కూడా ఫస్ట్ చాన్స్ తమకే ఇవ్వాలని కూడా కోరతారు అని చెబుతున్నారు. ఒక వేళ తొలి రెండున్నరేళ్ళు కాకుండా చివరి రెండున్నరేళ్ళు అంటే మాత్రం అసలు ఒప్పుకోరాదని కూడా చెబుతున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో నమ్మడాలు అంటే మోసపోవడాలే అని అంటున్నారు. అక్కడ ఉన్నది చంద్రబాబు. ఆయన రాజకీయ వ్యూహాలు బహు గొప్పగా ఉంటాయని. అందువల్ల తొలి రెండున్నరేళ్ళు బాబు గద్దెనెక్కితే ఈలోగా జనసేనలోనే చీలిక తెచ్చి టోటల్ గా కలిపేసుకుంటారు అన్న భయాలు ఉన్నాయని చెబుతున్నారు.
మరో వైపు చూస్తే బీజేపీ కూడా జనసేనకే సపోర్ట్ గా ఈ విషయంలో ఉంది అంటున్నారు. టీడీపీతో పొత్తు వద్దు అని అంటున్న బీజేపీ మెత్తబడి ఒక కండిషన్ పెట్టింది అని ప్రచారం సాగుతోంది. అదేంటి అంటే అధికారంలో బీజేపీ జనసేన కూటమికి సమాన వాటా ఇస్తే కనుక కళ్ళుమూసుకుని పొత్తులు పెట్టుకోవడానికి తమకు అభ్యంతరం లేదని. అంటే ఒక వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు కూడా జనసేనకు దక్కుతున్న ఈ కీలక సమయంలో బంతి కచ్చితంగా టీడీపీ కోర్టులోనే ఉంది అంటున్నారు. టీడీపీ కనుక పొత్తులకు సిద్ధపడితే పవన్ని ముఖ్యమంత్రిగా ఒప్పుకోవాల్సిన అనివార్యత ఉంటుందని అంటున్నారు.
ఒకవేళ అలా కాదూ కూడదు అంటే విడిగా పోటీగా చేస్తూనే ఒకరికి ఒకరు సహకరించుకోవడం, ఎన్నికల తరువాత కలవడం. అలా చూసుకున్నా హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుంది అన్న అంచనాలు వేస్తున్న జనసేన నాయకులు కచ్చితంగా పవన్ సీఎం అవుతారు అనే అంటున్నారు. అటు వైసీపీకి ఇటు టీడీపీకి మెజారిటీ రాకపోతే తమ నేతనే ఇద్దరిలో ఎవరో ఒకరు కుర్చీలో కూర్చోబెట్టడం ఖాయమని అంటున్నారు. సో ఈసారి అంటే 2024 ఎన్నికలలో కాపు ముఖ్యమంత్రి రావడం కన్ ఫర్మ్ అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.