Begin typing your search above and press return to search.
మంత్రులూ డైపర్లు కొనుక్కోండి: జనసేన కామెంట్స్
By: Tupaki Desk | 8 Jun 2023 11:00 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి తూర్పు గోదావరి జిల్లాలో వారాహి యాత్రను ప్రారంభిం చనున్నారు. దీంతో రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక ఇప్పటికే వైసీపీ మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ నాని సహా పలువురు నేతలు జనసేనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
ఈ యాత్ర చంద్రబాబు కోసం చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన, వైసీపీల మధ్య మాటలు సహా ఫ్లెక్సీల యుద్ధం సాగుతోంది. ఇక, ఇప్పుడు తాజాగా జనసేన నాయకులు వైసీపీ మంత్రులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వారాహి యాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో వైసీపీ మంత్రులు డైపర్లు కొనుక్కోవాలని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వారాహి యాత్ర తర్వాత.. వైసీపీకి చలీ జ్వరం రావడం ఖాయమని.. అప్పుడు కూర్చున్న చోట నుంచి పడుకున్న చోట నుంచి కూడా లేవలేరని.. అలాంటి సమయంలో డైపర్లు చాలా అవసరం అవుతాయని రాయల్ వ్యాఖ్యానించారు.
``వారాహి తరువాత వైసీపీ నాయకులకు ముఖ్యంగా అంబటి, గుడివాడ, పేర్ని, కొడాలి, రోజా వంటివారికి డైపర్లు అవసరం పడుతుంది. ఆన్లైన్లో మంచి ఆఫర్లు వున్నాయి. ఇప్పుడే కొనుగోలు చేసుకోండి. లేకపోతే.. మీలో మీకే పోటీ వచ్చి.. దొరక్కపోయినా ఆశ్చర్యం లేదు`` అని రాయల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వారాహి యాత్రపై మాపై నోటికొచ్చినట్లు మాట్లాడితే కొరియర్ లో తామే నేతల ఇంటికి డైపర్ లను పంపిస్తామని రాయల్ వ్యాఖ్యానించారు.