Begin typing your search above and press return to search.

తిరుప‌తి పోరులో సేనాని క‌లిశాడు.. సేనే దూరంగా ఉంది.. రీజనేంటి ?

By:  Tupaki Desk   |   7 April 2021 5:30 PM GMT
తిరుప‌తి పోరులో సేనాని క‌లిశాడు.. సేనే దూరంగా ఉంది.. రీజనేంటి ?
X
తిరుప‌తి పార్ల‌మెంటుకు జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో బీజేపీ ప‌క్షాన ప్ర‌చారం చేసేందుకు జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముందుకు వ‌చ్చారు. ఇప్ప‌టికే ఒక ప్ర‌చార స‌భ కూడా నిర్వ‌హించారు. సీఎం జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. రాష్ట్రంలోని హిందూ ఆల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్నా.. రామ‌తీర్థంలో రాముడి త‌ల న‌రికినా ఎందుకు ప‌ట్టించుకోలేదు.. ? ఎందుకు నిందితుల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్టు చేయ‌లేదు? అనిప్ర‌శ్నించారు. అంతేకాదు.. వైసీపీకి ఓటేస్తే.. తిరుమ‌ల వెంక‌న్న‌కు ద్రోహం చేసిన‌ట్టేన‌ని.. సెంటిమెంటు డైలాగులు సైతం పేల్చి తిరుప‌తి పార్ల‌మెంటు పోరును ర‌స‌వ‌త్త‌రం చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. మ‌రి జ‌న‌సేనాని ఇప్పు డు మ‌ళ్లీ షూటింగు ఉందంటూ.. హైద‌రాబాద్‌కు వెళ్లిపోయారు.

దీంతో క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన‌ను క‌లుపుకొని వెళ్లేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కానీ, ఒక్క నాదెండ్ల మ‌నోహ‌ర్ మిన‌హా ఎవ‌రూ కూడా ముందుకు రావ‌డం లేదు. దీనికి కార‌ణం ఏంటి? సోము వీర్రాజు.. ప‌వ‌న్‌ను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన త‌ర్వాత ఊపు వ‌స్తుంద‌ని భావించిన పార్టీలో ఎందుకు ఇప్పుడు నైరాశ్యం వెంటాడుతోంది? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆయా నేత‌లు ప్ర‌జ‌ల్లో తిరుగుతుంటే.. మీ పార్టీ బీజేపీతోనే క‌లిసి ఉందిక‌దా.. మ‌రి విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించ వ‌ద్ద‌ని ప‌వ‌న్ ఏమైనా బీజేపీకి చెప్పాడా? ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌మ‌ని అడిగాడా? క‌నీసం .. తిరుప‌తిని అభివృద్ధి చేసేందుకు అవ‌స‌రమైన హామీలు పొందారా? అనే ప్ర‌శ్న‌లు వారికి ఎదుర‌వుతున్నాయ‌ట‌.

వాస్త‌వం ఇదే! ప‌వ‌న్‌ను అయితే.. నేరుగా ప్ర‌శ్నించ‌లేక‌పోయినా.. సోష‌ల్ మీడియాలోనూ ఇదే త‌ర‌హా ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. అంతేకాదు.. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్న వారికి ప్ర‌జ‌ల నుంచి ఈ ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. మీరు హామీ తెచ్చుకోకుండా.. బీజేపీకి ఓటేయ‌మ‌ని ఎలా చెబుతారు ? అనే మ‌హిళ‌లు కూడా పెరుగుతున్నారు. కొన్ని వ‌ర్గాల‌కు చెందిన మీడియా.. ఇప్పుడు బీజేపీకి దూరంగా ఉంటోంది.

ప‌వ‌న్‌పై అభిమానం ఉన్న‌ప్ప‌టికీ.. ప‌వ‌న్ పూర్తిగా బీజేపీకి మ‌ద్ద‌తుగా మార‌డంతో .. టీడీపీకి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో.. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన వార్త‌ల‌ను పూర్తిగా ఎవాయిడ్ చేస్తున్నారు. దీంతో ఈ విష‌యాలు వెలుగు చూడ‌క‌పోయినా.. ఇదే వాస్త‌వం అంటున్నారు జ‌న‌సేన నేత‌లు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌లిసినా.. ప‌వ‌న్ అభిమానులు, జ‌న‌సేన నేత‌లు మాత్రం బీజేపీతో క‌లిసిముందుకు సాగ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డ‌డం గ‌మ‌నార్హం.