Begin typing your search above and press return to search.

పవన్ కీలక ప్రకటన.. తెలంగాణ ఎన్నికల్లో జనసేన!

By:  Tupaki Desk   |   13 Jun 2023 10:00 AM GMT
పవన్ కీలక ప్రకటన.. తెలంగాణ ఎన్నికల్లో జనసేన!
X
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సత్తా చాటాల ని బలంగా భావిస్తున్న ఆయన తెలంగాణ లో కూడా పోటీ చేయాల ని భావిస్తున్నారు. తెలంగాణ లో కూడా పవన్ కు భారీ ఫ్యాన్ బెల్ట్ ఉండటం తో... అక్కడ కూడా జనసేన కీలకంగా మారాల ని భావిస్తుంది.

అవును... తెలంగాణ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయబోతోంది. ఈ మేరకు జనసేన అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. ఎన్నికల కు సిద్ధంగా ఉండాల ని తెలంగాణ నేతల కు పిలుపునిచ్చారు. త్వరలో తెలంగాణ లోనూ వారాహి యాత్ర ఉంటుందని ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేశారు. జనసేన సత్తా చూపించేలా 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ చార్జ్‌ లను ప్రకటించారు.

తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నేరవేర్చడమే జనసేన లక్ష్యం అంటూ 26 మంది అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించారు.

1. శ్రీ వేమూరి శంకర్ గౌడ్ – కూకట్ పల్లి

2. శ్రీ పొన్నూరు లక్ష్మి యి శిరీష – ఎల్బీనగర్

3. శ్రీ వంగ లక్ష్మణ గౌడ్ – నాగర్ కర్నూలు

4. శ్రీ తేజవత్ సంపత్ నాయక్ – వైరా

5. శ్రీ మిరియాల రామకృష్ణ – ఖమ్మం

6. శ్రీ గోకుల రవీందర్ రెడ్డి – మునుగోడు

7. శ్రీ నందగిరి సతీష్ కుమార్ – కుత్బుల్లాపూర్

8. డాక్టర్ మాధవరెడ్డి – శేరిలింగం పల్లి

9. శ్రీ ఎడమ రాజేష్ – పటాన్ చెరువు

10. శ్రీమతి మండపాక కావ్య -సనత్ నగర్

11. శ్రీ వై.ఎమ్.ఎన్.ఎస్.ఎస్.వి నిహారిక నాయుడు – ఉప్పల్, శివ కార్తీక్ కో కన్వీనర్ – ఉప్పల్

12. శ్రీ వేముల కార్తీక్ – కొత్తగూడెం

13. శ్రీ డేగల రామచంద్ర రావు – అశ్వరావుపేట

14. శ్రీ శ్రీ వి.నగేష్ -పాలకుర్తి

15. శ్రీ మేరుగు శివకోటి యాదవ్ -నర్సంపేట

16. శ్రీ గాదె పృద్వి – స్టేషన్ ఘన్ పూర్

17. శ్రీ తగరపు శ్రీనివాస్ – హుస్నాబాద్

18. శ్రీ మూల హరీష్ గౌడ్ – రామగుండం

19. శ్రీ టెక్కల జనార్ధన్ – జగిత్యాల

20. శ్రీ చెరుకుపల్లి రామలింగయ్య -నకిరేకల్

21. శ్రీయన్ నాగేశ్వరరావు – హుజూర్ నగర్

22. శ్రీ మాయ రమేష్ – మంథని

23. శ్రీ మేకల సతీష్ రెడ్డి – కోదాడ

24. శ్రీ బండి నరేష్ – సత్తుపల్లి

25. శ్రీ వంశీకృష్ణ – వరంగల్ వెస్ట్

26. శ్రీ బాలు గౌడ్ – వరంగల్ ఈస్ట్

కాగా, ఏపీ లో ఇప్పటికే వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారైంది. మంగళగిరి లోని పార్టీ ఆఫీసు లో ప్రత్యేక పూజల తర్వాత.. ఈనెల 14న అన్నవరం దేవస్థానం నుంచి మొదలై.. భీమవరం వరకు తొలి విడత వారాహి యాత్ర సాగనుంది. ఈ సందర్భంగా... ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో యాత్ర కు జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.