Begin typing your search above and press return to search.

జ‌న‌సేన ఎంపిక‌లు..ఇప్పుడు హైద‌రాబాద్ లో

By:  Tupaki Desk   |   23 May 2017 5:50 PM GMT
జ‌న‌సేన ఎంపిక‌లు..ఇప్పుడు హైద‌రాబాద్ లో
X
జ‌న‌సేన పార్టీ అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మిగ‌తా రాజకీయ పార్టీల‌కు భిన్నంగా...``ఎంపిక`` ప్రక్రియ ద్వారా క‌లిసి వ‌చ్చే వారిని త‌న రాజకీయ పార్టీలోకి తీసుకునేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మొద‌టి ద‌శ‌లో అనంత‌పురంను ఎంచుకొని జ‌న‌సేన ఈ ప్ర‌క్రియ‌ను పూర్తిచేసింది. ఆ త‌దుప‌రి ద‌శ‌లో భాగంగా ఏప్రిల్‌ 21 నుంచి రెండో ద‌శ‌ నియామ‌కాల‌కు శ్రీ‌కారం చుట్టింది. రెండో ద‌శ ఎంపిక‌లో ఉత్త‌రాంధ్ర‌లో ఎంపిక పూర్తిచేసిన జ‌న‌సే తాజాగా హైద‌రాబాద్‌ల నియ‌మాకాల‌ను మొద‌లుపెట్టింది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో జ‌న‌సేన సైనికుల‌ను ఎంపిక చేసేందుకు సికింద్రాబాద్లోని కొంపల్లిలో గ‌ల దోల-రి-దాని ఎదురుగా ఉన్న ఏఎంఆర్ గార్డెన్స్‌లో ఎంపికను జ‌న‌సేన పార్టీ నేత‌లు చేప‌ట్టారు. 24,25 తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎంపిక కొన‌సాగ‌నుంది. కాగా, జ‌న‌సేన పార్టీకి స్పీకర్స్ (వక్త), అనలిస్ట్ కంటెంట్ రైటర్స్ గా సేవలు అందించడానికి గ్రేటర్ హైదరాబాద్ నుంచి 4500 దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా జనసేన పరిపాలన కార్యాలయానికి అందాయి. వీరికి ఈ మూడు రోజుల పాటు ఎంపిక ప్ర‌క్రియను నిర్వ‌హించ‌నున్నారు. ఇదిలాఉండ‌గా ఇటీవ‌లే 17,18 తేదీల్లో శ్రీకాకుళం, 19,20న విశాఖ జిల్లాలో ఇంటర్వూలు నిర్వ‌హించారు. స్పీకర్స్ (వక్త), అనలిస్ట్ కంటెంట్ రైటర్స్ గా సేవలు అందించడానికి ఉత్తరాంధ్ర నుంచి 6000 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఇందుకోసం ఎంపిక ప్ర‌క్రియ‌ను పూర్తి చేశారు.