Begin typing your search above and press return to search.

ఇదేందయ్యా.. ఇది.. పవన్ పై జన సైనికుల పంచులు

By:  Tupaki Desk   |   21 Nov 2020 4:30 AM GMT
ఇదేందయ్యా.. ఇది.. పవన్ పై జన సైనికుల పంచులు
X
జీహెచ్​ఎంసీ ఎన్నికలు జనసేన అధినేత పవన్​కల్యాణ్​కు చిక్కులు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు సొంతపార్టీ నేతలే జనసేనానిపై విమర్శలు గుప్పిస్తున్నారు. గ్రేటర్​ ఎన్నికల్లో పోటీచేసి సత్తా చాటుదామనుకున్న జనసైనికుల ఆశలపై పవన్​కల్యాణ్​ నీళ్లు చల్లారు దీంతో వాళ్లు రగిలిపోతున్నారు. ఇలా చేస్తే పార్టీ ఎప్పటికి ముందుకు వెళ్తుందని తోకపార్టీలాగే ఉండిపోతుందని వాళ్లు విమర్శిస్తున్నారు. సొంతపార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో పవన్​కల్యాణ్​ కూడా ఆలోచనలో పడ్డారట. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తానని తొలుత పవన్​కల్యాణ్​ ప్రకటించారు. మొత్తం 60 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారని చెప్పారు. అయితే ఈ విషయంపై మిత్రపక్షం బీజేపీ నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని అంతా భావించారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రకటనతో గందరగోళం నెలకొన్నది. తాము ఎవరితోనూ పొత్తుపెట్టుకోబోమని.. అన్ని స్థానాల్లో బీజేపీ పోటీచేస్తుందని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్రమంత్రి కిషన్​రెడ్డి. బీజేపీ నేత లక్ష్మణ్ .. పవన్​కల్యాణ్​తో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం పవన్​కల్యాణ్​ మీడియా ముందుకొచ్చి.. తాము జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పోటీచేయడం లేదని.. బీజేపీకి మద్దతిస్తామని ప్రకటించారు. ఇప్పటికే నామినేషన్​ వేసిన జనసేన అభ్యర్థులు విత్​డ్రా చేసుకోవాలని ఆయన ఆదేశించారు. దీంతో జన సైనికులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ముందు తమను పోటీచేయమని చెప్పి.. అంతా సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు ఇలా ప్రకటించడం ఏమిటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. తాము ఇప్పటికే ప్రచారం చేసుకున్నామని.. ఇప్పు డు ఇలా చెప్పడం ఏమిటని వాళ్లు సోషల్​మీడియా వేదికగా అడుగుతున్నారు.

నిరంతరం జనసేనపై విమర్శలు గుప్పించే సినీ క్రిటిక్​ మహేశ్​కత్తి పవన్​కల్యాణ్​పై విమర్శలు గుప్పించారు. ‘జనసేన కార్యకర్తలు జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పోటీచేయాలనుకున్నా.. అది వారి అధినేత దానికి అంగీకరించలేదు’ అంటూ కత్తి మహేశ్​ ఫేస్​బుక్​లో పోస్టుపెట్టారు. ఆయన మరో పోస్ట్ లో ఏమన్నారంటే.. ‘ జీహెచ్​ఎంసీ ఎన్నికలపై పవన్​ కల్యాణ్​ తీసుకున్న నిర్ణయం నాకు ఏమీ ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే జనసేన ఓ కులతత్వ పార్టీ.. బీజేపీ మతతత్వ పార్టీ ఈ రెండు పార్టీలు కలిశాయి తప్పేముంది’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

మరో నెటిజన్​ ఏమన్నాడంటే.. ‘ జనసేన అధినేత తన కార్యకర్తలతో కనీసం సంప్రదింపులు కూడా జరపకుండా ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఇది అతడి బానిసత్వానికి నిదర్శనం. జనసేనాని బీజేపీకి బానిస అని మరోసారి నిరూపించాడు.’ అంటూ వ్యాఖ్యానించాడు. ‘పవన్​ ఇటువంటి నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదు. అతడు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయినా నేను ఎంతో గౌరవించేవాడిని. ఇప్పుడిలా చేసి అభిమానులను కూడా దూరం చేసుకుంటున్నాడు’ ఇలా పవన్​కల్యాణ్​పై అతడి అభిమానుల నుంచే విమర్శలు ఎదురవుతున్నాయి.