Begin typing your search above and press return to search.
అభ్యర్థులు కావాలి బాబూ.. అభ్యర్థులు!
By: Tupaki Desk | 13 March 2019 3:59 PM GMTఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు కావాలట.. ఒకటి కాదు రెండు కాదు.. మూడు పార్టీలు ఇప్పుడు అభ్యర్థుల కోసం వేచి చూస్తున్నాయి. ఏపీ రాజకీయంలో అభ్యర్థులు లేని ఆ మూడు పార్టీలు మరేవో కావు.. జనసేన - కాంగ్రెస్ - బీజేపీలు. రెండు జాతీయ పార్టీలు.. ఒకటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీ. అయితే ఇప్పుడు ఈ పార్టీల పరువు నిలిపేందుకు సరైన అభ్యర్థులు లేకుండా పోయారు!
ముందుగా కాంగ్రెస్ కథ చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ముందే..ఖాళీ అయిపోయింది. గత ఎన్నికల్లోనే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరఫున అనామకులు పోటీ చేశారు. ఈ సారి అలాంటి అనామకులు కూడా కనిపించడం లేదు. కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేస్తే ఏమైనా పార్టీ ఫండ్ వస్తుందేమో అని కొందరు అలా అప్లికేషన్లు పెట్టుకున్నారు. అయితే అదేమీ రాదని తెలిసి.. నామినేషన్ కోసం డిపాజిట్ కట్టడానికి చాలా మంది వెనుకాడే పరిస్థితి ఉంది!
గత ఎన్నికల సమయంలో జిల్లాకో ప్రముఖుడు అయిన కాంగ్రెస్ పార్టీ తరఫున కనిపించారు. అయితే ఇప్పుడు వారు కూడా లేరు.దీంతో అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు అవుతాయా? అనేది కొశ్చన్ మార్క్. ఇక గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని.. రెండు ఎంపీ - కొన్ని ఎమ్మెల్యే సీట్లను కూడా నెగ్గిన బీజేపీకి ఇప్పుడు నామినేషన్ కష్టాలు వచ్చాయట. బీజేపీ తరఫున కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీకి అభ్యర్థులు దొరుకుతారా? అనేది సందేహంగా కనిపిస్తూ ఉంది.
అయితే కాంగ్రెస్ కన్నా బీజేపీ పరిస్థితి కొంచెం బెటర్. కేంద్రంలో బీజేపీ చేతిలో పవర్ ఉంది, వచ్చేసారి కూడా బీజేపీకి కేంద్రంలో అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి.. బీజేపీ తరఫున నామినేషన్లు వేయడానికి అయితే ఎవరో ఒకరు దొరికే పరిస్థితి ఉంది. అయితే అలాంటి వారు కనీసం వెయ్యి ఓట్లు అయినా సాధించగలరా? అనేది వేరే కథ.
ఇక ఆ రెండింటి పార్టీల కన్నా కొంచెం బెటర్ గానే ఉన్నా… అభ్యర్థుల ఎంపిక విషయంలో తర్జనభర్జనలు పడుతోంది జనసేన. అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు తీసుకున్న జనసేనకు చాలా మంది నుంచి అప్లికేషన్లు వచ్చాయి కానీ, వాళ్లలో ఎవరికి ఎమ్మెల్యేగా నెగ్గేంత సీన్ ఉంది? అనేది తేల్చేడానికి సమయం కూడా కనపడటం లేదు.
అప్లికేషన్లు పెట్టుకొమ్మన్నారు కాబట్టి… ఊరు పేరు కూడా లేని వాళ్లంతా అప్లికేషన్లు పెట్టుకున్నారు. దీంతో మొత్తం పదిహేను వంద అప్లికేషన్లు వచ్చాయట. వాటిని ఓపెన్ చేసి ఒక్కోటి పరిశీలించాలంటేనే నెల రోజులు పట్టేలా ఉంది. అంతలోనే ఎన్నికలు అయిపోతాయి.
అందుకే ఆ అప్లికేషన్లను పూర్తిగా పక్కన పెట్టేసి.. పార్టీ తరఫున అభ్యర్థులను ఎంపిక చేసే యత్నంలో ఉందట జనసేన. అయితే గోదావరి జిల్లాల వరకూ అభ్యర్థులు దొరుకుతున్నారు. వారి ప్రభావం ఎంత అనేది పక్కన పెడితే.. అక్కడ ఉత్సాహవంతులు కనిపిస్తున్నారు. ఆ జిల్లాలు దాటి వస్తే మాత్రం.. జనసేనకు మరీ అనామకులే దొరుకుతుండటం విశేషం. దీంతో వారికి టికెట్ ఇచ్చినా లాభం ఉండదని.. ఆయా నియోజకవర్గాల్లోని సామాన్యులు కూడా తేల్చి చెబుతున్నారు.
దీంతో బలమైన అభ్యర్థల వేటలో ఉంది జనసేన. కాంగ్రెస్ - బీజేపీల కన్నా ఈ పార్టీ పరిస్థితి బాగానే ఉన్నా… అభ్యర్థుల కరువైతే ఉంది. టీడీపీ - వైఎస్సార్సీపీల్లో టికెట్లు దక్కని వారు ఎవరైనా వస్తారా.. అని జనసేన ఆశిస్తున్నా.. ప్రస్తుతానికి అయితే అలాంఇ అవాకశం లేదని తేలిపోతోంది.