Begin typing your search above and press return to search.

పవన్ పై అసభ్య ఫొటోలు.. సైబర్ క్రైంకు జనసేన ఫిర్యాదు

By:  Tupaki Desk   |   15 Sept 2020 10:30 PM IST
పవన్ పై అసభ్య ఫొటోలు.. సైబర్ క్రైంకు జనసేన ఫిర్యాదు
X
సోషల్ మీడియానే ఆయుధంగా వాడే జనసేన పార్టీ ఏకంగా పోలీసుల గడప తొక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఎవరైనా ఏమైనా అంటే విరుచుకుపడుతూ ట్రోల్స్ చేసే జనసేన ఫ్యాన్స్ దెబ్బ రాష్ట్రమంతా తెలుసు. కానీ వారే బాధితులుగా పోలీసులను ఆశ్రయించడం సంచలనమైంది.

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అసత్యప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ పార్టీ అధ్యక్షుడిపై సోషల్ మీడియాలో అస్యతం ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైంకు జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ విభాగం ఫిర్యాదు చేసింది.

ఏపీలోని అంతర్వేది ఆలయ రథం దగ్గం ఘటనపై ధర్మ పోరాట దీక్ష చేసిన పవన్ ఫొటోలు మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. పవన్ ఫొటోలను క్షుద్రపూజలు చేస్తున్న విధంగా చిత్రీకరించి అసభ్యపదజాలంతో దూషిస్తూ ప్రచారం చేస్తున్నారని పోలీసులకు విన్నవించారు.

పవన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరామని.. పోలీసులు సానుకూలంగా స్పందించారని జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం తెలిపారు.