Begin typing your search above and press return to search.

బీజేపీపై పొత్తు అందుకే.. జ‌న‌సేన క్లారిటీ ఇచ్చేసిందా!

By:  Tupaki Desk   |   31 Oct 2021 12:30 PM GMT
బీజేపీపై పొత్తు అందుకే.. జ‌న‌సేన క్లారిటీ ఇచ్చేసిందా!
X
ఏపీ రాజ‌కీయాల్లో అనూహ్య పొత్తు పెట్టుకున్న బీజేపీ-జ‌న‌సేన‌ల వ్యూహాన్ని ఎట్ట‌కేల‌కు ఆ పార్టీ కీల‌క నాయ‌కుడు.. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. శివ‌శంక‌ర్ బ‌య‌ట పెట్టారు. ఈ రెండు పార్టీల వ్యూహాలు వేర‌ని.. ఆయ‌న చెప్పారు.కేవ‌లం త‌మ పార్టీల మ‌ధ్య ఉన్న బంధం `తాత్కాలిక‌`మేన‌ని స్ప‌ష్టం చేశారు. రెండు పార్టీల‌కూ.. కామ‌న్ అజెండా.. వ్యూహాలు వంటివి ఏమీ లేవ‌ని స్ప‌ష్టం చేశారు. ``బీజేపీకి మేం గుడ్డిగా మ‌ద్ద‌తు తెలుపుతామ‌ని.. ఆపార్టీ నేత‌లు.. భావించొద్దు. వారు చేసే ప‌నుల‌పై మేం ఏదో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని వారు భావించాల్సిన అవ‌స‌రం లేదు`` అని తేల్చి చెప్పారు. ఈ మేర‌కు శివ‌శంక‌ర్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

త‌మ రెండు పార్టీల మ‌ద్య పొత్తు కేవ‌లం ఎన్నిక‌ల వ్యూహంతోనే జ‌రిగింద‌ని శివ‌శంక‌ర్ స్ప‌ష్టం చేశారు. ``బీజేపీ, జ‌న‌సేన‌ల‌కు సొంత అజెండాలు ఉన్నాయి. అదేవిధంగా వ్యూహాలు ఉన్నాయి. అనుచ‌రులు.. కూడా ఉన్నారు`` అని తెలిపారు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటీక‌రిస్తామ‌న్న‌.. బీజేపీ విధానాల‌కు జ‌న‌సేన ఎట్టిప‌రిస్థితిలోనూ మ‌ద్ద‌తు తెల‌ప‌ద‌ని ఆయ‌న తెలిపారు. ``ప్ర‌స్తుతం విశాఖ ఉక్కు కోసం జ‌రుగుతున్న ఉద్య‌మానికి, ఆందోళ‌న‌ల‌కు మేం మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నాం. మా నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆదివారం విశాఖ‌ప‌ట్నంలోని కూర్మ‌న్న పాలెంలో మ‌ద్యాహ్నం 2 గంట‌ల‌కు స‌భ నిర్వ‌హిస్తున్నారు`` అని శివ‌శంక‌ర్ తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌వేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న స‌భ‌లో.. ప‌వ‌న్ బారీ బ‌హిరంగ స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న జ‌న‌సేన భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను కూడా ప్ర‌క‌టించ‌నున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు ప్రాధ‌మికంగా.. ఈ స‌భ‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు. అయితే.. త‌ర్వాత‌.. మ‌ళ్లీ వారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప‌రిస‌రాల‌కు దూరంగా.. స‌భ పెట్టుకునేందుకు అనుమ‌తి ఇచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. మాజీ ఐపీఎస్‌, సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌.. ప‌వ‌న్‌.. విశాఖ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంపై అభినందించారు. ఈ మేర‌కు ఆయ‌న ప‌వ‌న్‌ను ఉద్దేశించి ట్వీట్ కూడా చేశారు.

ఈ నేప‌థ్యంలో గ‌తంలో జ‌న‌సేన‌లోనే ఉన్న లక్ష్మీనారాయ‌ణ‌.. గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. త‌ర్వాత కూడా ఆయ‌న పార్టీలో ఉన్నారు. విశాఖ వాసుల‌కు అండ‌గా ఉంటాన‌ని కూడా ప్ర‌క‌టించారు. అయితే.. ప‌వ‌న్ మ‌ళ్లీ సినిమాల్లోకి వెళ్ల‌డంతో ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇది జ‌రిగి.. ఏడాదిన్న‌ర అవుతోంది. ఈ క్ర‌మంలో.. ఇప్పుడు తాజాగా మ‌రోసారి ప‌వ‌న ను ఆకాశానికి ఎత్తేయ‌డం.. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ప‌వ‌న్ గ‌ళం వినిపించ‌డాన్ని ఆయ‌న స‌మ‌ర్ధించ‌డం వంటివి చూస్తే..త్వ‌ర‌లోనే వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ తిరిగి జ‌న‌సేన గూటికి చేర‌తార‌నే సంకేతాలు ఇచ్చిన‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.