Begin typing your search above and press return to search.

జ‌నాల‌కు జ‌న‌సేన పిలుపు.. విష‌యం ఏంటంటే!

By:  Tupaki Desk   |   28 Aug 2021 2:59 AM GMT
జ‌నాల‌కు జ‌న‌సేన పిలుపు.. విష‌యం ఏంటంటే!
X
ఏపీలో ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తున్న ప‌ప‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ ప‌లు అంశాల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ నిల‌దీత‌కు దూకుడు ఉందా? విమ‌ర్శ‌లు ద‌ట్టిస్తున్నారా? ఫైర్ బ్రాండ్ మాదిరిగా వ్యాఖ్య‌లు సంధిస్తున్నారా? అనే విష‌యాలను ప‌క్క‌న పెడితే.. మొత్తానికి అయితే.. వివిధ స‌మ‌స్య‌ల‌పై మాత్రం జ‌న‌సేన నేత‌లు ఒకింత వాయిస్ వినిపిస్తున్నారు. హిందూ దేవాల‌యాల‌పై దాడులు జ‌రిగిన‌ప్పుడు వెంక‌ట‌మ‌హేష్ వంటివారు వాయిస్ బాగానే వినిపించారు. త‌ర్వాత‌.. విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైన‌ప్పుడు ఏకంగా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రంగంలోకి దిగి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ ప‌రిణామం.. జ‌న‌సేన‌కు క‌లిసి వ‌స్తోందా? లేదా? అనే చ‌ర్చ ప‌క్క‌న పెడితే.. మొత్తానికి అయితే.. అంతో ఇంతో యాక్టివ్‌గానే ఉంటున్నార‌నేది వాస్త‌వం. ఇక‌, ఇటీవ‌ల కాలంలో.. రాష్ట్రంలో ఆస్తిప‌న్నులు పెంచ‌డంపైనా.. నాదెండ్ల మ‌నోహ‌ర్ వాయిస్ వినిపిస్తున్నారు. ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం అవుతున్నార‌నే వాద‌న త‌ప్ప‌.. కొంత వ‌ర‌కు ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అదేస‌మ‌యంలో చెత్త‌పై ప‌న్ను విష‌యంలోనూ స‌ర్కారుకు ప్ర‌శ్న‌లు సంధించారు. దీంతో జ‌న‌సేన వాయిస్ వినిపిస్తోంద‌నే సంకేతాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నాయి. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో నేత‌ల బ‌లం మాత్రం పార్టీకి స‌రిపోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. స‌రే.. ఈ విష‌యం కూడా ప‌క్క‌న పెడితే.. తాజాగా జ‌న‌సేన నేత‌లు.. ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

అదేంటంటే.. రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయ‌ని.. రోడ్లు బాగుచేసేందుకు.. కొత్త ర‌హ‌దారులు నిర్మించేందుకు జ‌గ‌న్ స‌ర్కారు ముందుకు రావ‌డం లేద‌ని.. జ‌న‌సేన నేత‌లు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు..రాష్ట్ర వ్యాప్తంగా ర‌హ‌దారుల దుస్థితి ఇదీ.. అంటూ.. కొన్ని ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలోనూ పోస్టు చేశారు. బాగా గుంత‌లు ప‌డి.. నీటితో నిండిపోయి.. అస్సలు బాగోలేని ర‌హ‌దారుల‌ను టార్గెట్ చేస్తూ.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. సంక్షేమ ప‌థ‌కాల‌కు నిధులు ఇస్తున్నారు బాగానే ఉంది. కానీ, అదేస‌మ‌యంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ర‌హ‌దారుల‌ను కూడా ప‌ట్టించుకుని బాగు చేయాలి క‌దా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

ఇదే విష‌యంపై ప్ర‌జ‌లు కూడా ప్ర‌శ్నించాల‌ని.. తాము చేప‌ట్టే ర‌హ‌దారుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని.. జ‌న‌సేన నేత‌ల విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ఇదే విష‌యాన్ని జ‌న‌సేన సోష‌ల్ మీడియా వింగ్ భారీ ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. ``ప‌న్నులు క‌డుతున్నాం.. రోడ్లు బాగు చేయ‌మ‌ని అడిగే హ‌క్కు ప్ర‌తి ఒక్క‌రికీ ఊంటుంది`` అని పేర్కొంటున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌లు కూడా త‌మ త‌మ ప్రాంతంంలోని ర‌హ‌దారుల దుస్థితిని త‌మ దృష్టికి తీసుకురావ‌చ్చ‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ట్విట్ట‌ర్‌లో పెద్ద ఎత్తున ఫొటోల‌ను అప్‌లోడ్ చేస్తున్నారు. దీనికి JSP For AP roads అనే హ్యాష్ ట్యాగ్‌ను త‌గిలించ‌డం విశేషం. మ‌రి ఎంత మంది ప్ర‌జ‌లు వీరి వెంట న‌డుస్తారో చూడాలి.