Begin typing your search above and press return to search.

బస్సు యాత్రకు ముహూర్తం ఫిక్స్... డెడ్ లైన్ పెట్టేసిన పవన్ స్టార్....?

By:  Tupaki Desk   |   9 Nov 2022 3:30 AM GMT
బస్సు యాత్రకు ముహూర్తం ఫిక్స్...  డెడ్ లైన్ పెట్టేసిన పవన్ స్టార్....?
X
పవన్ కళ్యాణ్ జోరు పెంచేశారు. ఆయన రాజకీయ మోజు ఈ మధ్య బాగా పెరిగిపోతోంది. మనసు ఒక చోట మనిషి ఒక చోట అన్నట్లుగా ఆయన ప్రస్తుతం ఉన్నారని అంటున్నారు. ఏపీలో ఎన్నికలకు మరో ఏణ్ణర్ధం కాలం టైం ఉంది కానీ పవన్ ఈ మధ్య వరసగా జరిగిన సంఘటనలను బేరీజు వేసుకుని దూకుడుగానే ముందుకు సాగాలని చూస్తున్నారట. ఇదే వేడి కంటిన్యూ చేస్తే కనుక ఏపీ రాజకీయాల్లో పట్టు బాగా పెంచుకోవచ్చు అని ఆయన భావిస్తున్నారు.

దాంతో బస్సు యాత్రకు ముహూర్తం ఫిక్స్ చేశారని అంటున్నారు. జనవరి నెలాఖరు నుంచి పవన్ బస్సు యాత్ర ఉంటుందని పార్టీ వర్గాలలో సాగుతున్న ప్రచారం. అంటే ఇప్పటికి కచ్చితంగా కేవలం మూడు నెలలు మాత్రమే వ్యవధి ఉంది అన్న మాట. ప్రసుతం పవన్ సినిమాలలో ఫుల్ బిజీగా ఉన్నారు.  సినిమాలు ఆయన కమిట్ అయినవి  పూర్తి చేయాల్సి ఉన్నారు.

దాంతో వాటి విషయంలోనే ఆయన తొందరపడుతున్నారని అంటున్నారు.  డిసెంబర్ నాటికి తానూ కమిట్  అయిన సినిమాలను  మొత్తం పూర్తి చేయాలని ఆయన మేకర్స్ ని  కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే  సినిమాల వర్క్ ని టోటల్ గా  కూడా పూర్తి చేసుకుని జనవరి నెలాఖరుకు ఫుల్ ఫ్రీ కావాలన్నదే పవన్ ఆలోచనగా ఉంది అంటున్నారు. బస్సు యాత్రను నిజానికి దసరా రోజు నుంచి స్టార్ట్ చేయాలని పవన్ అనుకున్నారు కానీ వాయిదా వేశారు. ఈలోగా నియోజకవర్గ స్థాయిలలో పార్టీ సమీక్షలు నిర్వహించి బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు.

ఇపుడు ఆ పని కూడా ఒక వైపు సాగుతోంది అని అంటున్నారు. ఈ మూడు నెలల కాలంలో కమిటీలను పూర్తి స్థాయిలో వేయడమే కాకుండా ఇతర పార్టీల నుంచి చేరికల మీద కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టాలనుకుంటున్నారుట. బస్సు యాత్ర ఒకసారి స్టార్ట్ అయితే కనుక మొత్తం 175 నియోజకవర్గాలలో తిరిగి వస్తేనే తప్ప ఆగేది కాదు. దాంతో పవన్ కళ్యాణ్ పార్టీ యాక్టివిటీస్ మీద ఇపుడే ఎక్కువగా దృష్టి పెట్టి చెప్పాల్సినవి చేయాల్సినవి అన్ని చూసుకుంటున్నారని అంటున్నారు.

బస్సు యాత్ర సందర్భంగా ఆయన నియోజకవర్గాలలో బడా నాయకులను చేర్చుకోవడం ద్వారా పార్టీకి ఊపు తీసుకుని రావాలని పవన్ భావిస్తున్నారుట. అలాగే బస్సు యాత్ర అన్నది ఒక పెద్ద యజ్ఞం. దాంతో అన్ని రకాలుగా వ్యయ ప్రయాసలు చూసుకోవాలి. దానికి సంబంధించిన కార్యాచరణ మీద కూడా పార్టీ దృష్టి పెడుతోందని అంటున్నారు. మొత్తానికి ఇపుడు వచ్చిన ఊపుని వేడిని కంటిన్యూ చేస్తూ బస్సు యాత్రతో జనంలోకి వెళ్తే గేర్ మార్చడం ఖాయమన్నదే జనసేన ఆలోచనగా ఉంది అంటున్నారు.

ముందు ఏపీ అంతటా తిరిగి పార్టీ పరిస్థితిని అవలోకం చేసుకున్న మీదటనే ఎన్నికలకు ముందు పొత్తుల విషయం చర్చించాలన్నది కూడా పార్టీ వ్యూహంగా ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ తనకున్న బలాలను పరిశీలించడం, మరింతంగా పార్టీని పటిష్టం చేసుకోవడం ద్వారా ఏపీ రాజకీయాలో మూడవ ఆల్టర్నేషన్ గా అవతరించాలన్నదే పవన్ మార్క్ అజెండా అంటున్నారు.

అది నూటికి నూరు శాతం బస్సు యత్ర ద్వారా నెరవేరుస్తుంది అని పవన్ భావిస్తున్నారు. ఆ దిశగా ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ యంత్రాంగాన్ని కూడా సన్నద్ధం చేస్తున్నారు. అంటే కొత్త ఏడాదితో జనసేన రాజకీయ రధం ఏపీలో పరుగులు తీయడం ఖాయమని తేలిపోతోంది. ఆ దిశగా జనసైనికులు కూడా చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.