Begin typing your search above and press return to search.
పవన్ తో పొత్తులు : టీడీపీ సైలెంట్ మోడ్ లో...?
By: Tupaki Desk | 12 July 2023 10:00 PM GMTఏపీలో పొత్తుల కధ ఏ తీరం చేరుతుందో అన్నది తెలియడంలేదు. నిజానికి 2024లో పొత్తులతోనే వెళ్లాలని తెలుగుదేశం చాలా గట్టిగానే భావిస్తోంది. అయితే ఆ పొత్తులు ఎత్తులు అన్నీ టీడీపీ అనుకున్నట్లుగా ఆ పార్టీ ఆలోచనలకు తగినట్లుగానే ఉండాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఆ మధ్యదాకా జనసేన యాభై సీట్లకు తక్కువ కాకుండా డిమాండ్ చేస్తోంది అని ప్రచారం జరిగింది. ఆ కారణంగానే పొత్తు ప్రతిపాదనలు ముందుకు సాగలేదని అంటారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తన పార్టీ బలం మీద అనేక సర్వేలు చేయించారు అని ప్రచారం జరిగింది. పవన్ కూడా తమకు ఉభయగోదావరి జిల్లాలలో 37 శాతం ఓటు షేర్ ఉందని, ఉత్తరాంధ్రా జిల్లాలలో పాతికకు తగ్గకుండా ఓట్ల వాటా ఉందని చెప్పుకున్నారు.
అదే విధంగా దక్షిణ కోస్తాలో పదిహేను శాతం పైగా ఓట్ల షేర్ ఉండొచ్చని, రాయలసీమలో మాత్రం తమ పార్టీకి తక్కువ ఆదరణ ఉందని పవన్ ఆ మధ్య మీడియా మీటింగులో చెప్పుకొచ్చారు ఇక వారాహి యాత్ర రెస్పాన్స్ చూసుకుని సీట్ల దగ్గర రాయబేరాలు జరగాల్సి ఉంది. పవన్ సభలకు జనాలు బాగా వస్తున్నారు.
వారాహి మొదటి విడత యాత్ర సూపర్ హిట్ అయింది. దాంతో రెట్టించిన ఉత్సాహంతో పవన్ రెండవ విడత యాత్ర స్టార్ట్ చేశారు. అయితే తొలి రోజునే వాలంటీర్ల మీద పవన్ చేసిన కొన్ని వివాదాస్పద కామెంట్స్ హీట్ పుట్టించడంతో ఏపీలో వార్ డైలాగ్ స్టార్ట్ అయింది.
జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సాగుతున్న ఈ మాటల యుద్ధాన్ని టీడీపీ కూడా తిలకిస్తోంది. ఎట్టకేలకు వాలంటీర్ల మీద చంద్రబాబు రియాక్ట్ అవుతూ ఆ వ్యవస్థను పౌర సేవాలకు మాత్రమే ఉపయోగిస్తామని చెప్పారు. రాజకీయాలకు తావు లేదని అన్నారు. ఒక విధంగా వాలంటీర్ల వ్యవస్థ పట్ల చంద్రబాబు సానుకూలంగా మాట్లాడారు.
ఇక పవన్ వాలంటీర్ల మీద చేసిన కామెంట్స్ మీద ఆయన వాలంటీర్లు డేటా తీసుకుంటే తప్పే అని అభిప్రాయపడ్డారు. అంతటితో దాన్ని ముగించేశారు. ఇక జనసేన విషయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అని అంటున్నారు. వారాహి యాత్రకు ఆదరణ ఉన్నా అంతకు మించి వివాదాలలో పవన్ ఉన్నారని అంటున్నారు.
ఆయన తొలి విడత వారాహి యాత్రలో ఒక ఎమ్మెల్యేను బట్టలూడదీసి కొడతామని అనడం ముద్రగడ పద్మనాభం రంగంలోకి రావడంతో కాపు నేతల మధ్య వార్ గా మారింది అది. అపుడు కూడా టీడీపీ సైలెంట్ గానే ఉంది. ఇపుడు పవన్ కళ్యాణ్ తానే సీఎం అంటున్నారు. తమకే ప్రజలు ఓటేసి ఆదరించాలని చెబుతున్నారు.
పొత్తులు అన్నవి తరువాత మాట్లాడుదామని క్యాడర్ కి చెప్పారు. దానిని కూడా టీడీపీ గమనిస్తోంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాలలో మొత్తం ముప్పయి నాలుగు సీట్లను తమ పార్టీకే ఇవ్వమని కోరుతున్నారు. దీని మీద కూడా టీడీపీలో చర్చ సాగుతోంది. మొత్తానికి పొత్తుల మీద పవన్ పూటకో విధంగా మాట్లాడుతున్న తీరు పట్ల కూడా టీడీపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు
ఇక పొత్తుల విషయంలో పవన్ కనుక ముందుకు వస్తే అపుడు తాము ఎంత ఇవ్వాలో అన్ని సీట్లు ఇవ్వడానికే టీడీపీ సిద్ధపడుతుంది అని అంటున్నారు. పవన్ వర్సెస్ వైసీపీ తో ఆయన్ని అధికార పార్టీ రాజకీయంగా హైలెట్ చేసేలా వ్యూహ రచన చేస్తోంది అని టీడీపీ గ్రహించింది అని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ తో పొత్తుల విషయంలో సైలెంట్ గా ఉంటేనే అనుకున్న తీరున అన్నీ చక్కబడతాయన్నది టీడీపీ పక్కా వ్యూహంగా ఉంది అని అంటున్నారు.