Begin typing your search above and press return to search.

జానారెడ్డి.. సీరియస్ అయిన వేళ

By:  Tupaki Desk   |   25 Feb 2021 3:30 PM GMT
జానారెడ్డి.. సీరియస్ అయిన వేళ
X
పెద్దలు జానారెడ్డి గారు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలను మరోసారి ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలపై భగ్గుమన్నారు.తాజాగా పార్టీ నేతల తీరుపై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఏవైనా విభేదాలుంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలన్నారు.సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పోస్టులు పెట్టడమేంటని జానారెడ్డి మండిపడ్డారు. గ్రూపు రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీని బలహీన పరుస్తున్నారన్నారు. అలాంటి వారిపై పీసీసీ కఠిన చర్యలు తీసుకోవాలని లేకుంటే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు.

అభిమానుల అత్యుత్సాహం పార్టీలో దెబ్బతీస్తోందని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. సొంత పార్టీలో ఇలాంటి సంస్కృతి మంచిది కాదని హితవు పలికారు. గీత దాటే అభిమానులు, కార్యకర్తలపై పీసీసీ చర్యలు తీసుకోవాలని.. లేదంటే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు.పీసీసీ నాయకత్వం అంతా సమావేశమై అభిమానులను అదుపులో ఉంచేలా చూడాలని జానారెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేత వీహెచ్ ను తిట్టడం కరెక్ట్ కాదని హితవు పలికారు.