Begin typing your search above and press return to search.
రేవంత్ బ్యాచ్ కు వార్నింగ్ ఇచ్చిన జానారెడ్డి
By: Tupaki Desk | 25 Feb 2021 12:50 PM GMTచాలా రోజుల తర్వాత గాంధీ భవన్ వేదికగా చేసుకొని మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. త్వరలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్న వేళ.. ఆయనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావటంతో ఆయన తన గళాన్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. అనూహ్యంగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి బ్యాచ్ కు భారీ వార్నింగ్ ఇచ్చేశారు.
సోషల్ మీడియాలో కొద్దిమంది పార్టీ నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇతరుల్ని కించపరిచేలా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని.. ఇదేమాత్రం సరైనది కాదన్నారు. పార్టీలో ఇలాంటివి అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయని.. వీటిని కాంగ్రెస్ అస్సలు ఊరుకోదన్నారు. కొంతమంది నాయకుల అభిమానులు ఇలాంటి పనులు చేస్తున్నారని.. ఇలాంటి వాటి వల్ల సదరు నాయకుడికి కూడా నష్టమేనని స్పష్టం చేశారు.
తాను చెబుతున్న విషయాల్ని కాంగ్రెస్ నాయకత్వం సీరియస్ గా తీసుకోవాలన్నారు. ఒకవేళ తాను చెప్పిన విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోతే.. కాంగ్రెస్ హైకమాండ్ వద్దకు వెళతానని స్పష్టం చేశారు. అభిమానులతో పాటు.. వారి నేతలు కూడా క్రమశిక్షణతో ఉండాలన్న జానా.. ఒక మీటింగ్ పెట్టి సూచనలు ఇవ్వాలన్నారు. సొంత పార్టీ నేతల మీదనే కాదు.. కేసీఆర్ సర్కారు పైనా విమర్శలు గుప్పించారు. భారీ ఎత్తున తమ ప్రభుత్వం సర్కారు ఉద్యోగాల్ని ఇచ్చిందంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఒకవేళ అలా చేసి ఉంటే.. పీఆర్సీ కమిషన్ ఇచ్చిన 1.91లక్షల ఉద్యోగాల ఖాళీ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. రేవంత్ పేరును నేరుగా ప్రస్తావించకుండా జానా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.