Begin typing your search above and press return to search.

బాబు-ప‌వ‌న్‌లు ఎక్క‌డ క‌లుస్తారోన‌ని.. బీజేపీకి బెంగ ప‌ట్టుకుందా?

By:  Tupaki Desk   |   7 Jan 2022 5:12 PM GMT
బాబు-ప‌వ‌న్‌లు ఎక్క‌డ క‌లుస్తారోన‌ని.. బీజేపీకి బెంగ ప‌ట్టుకుందా?
X
ఏపీ బీజేపీకి పెద్ద బెంగే ప‌ట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. రాష్ట్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని ప‌దే ప‌దే చెబుతున్న బీజేపీ నేత‌ల‌కు.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో బెంగ మొద‌లైంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. చంద్ర‌బాబు.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న నిర్వ‌హిస్తున్న బ‌హిరంగ స‌భ‌లో ఒక‌రు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న చ‌మ‌త్కారంగా స‌మాధానం చెప్పారు. పొత్తులు ఉంటే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించారు. అప్ప‌టి ప‌రిస్థితిని బ‌ట్టి పొత్తు రాజ‌కీయాలు చేస్తామ‌ని చెప్పారు. నేరుగా జ‌న‌సేన‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడ‌క పోయినా.. పొత్తులు మాత్రం ఖాయ‌మ‌నే సంకేతాలు ఇచ్చారు.

ఇక‌, ఈ వ్యాఖ్య‌లు వెలువ‌డ‌గానే.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు అవకాశవాది అని అన్నారు. ``చంద్ర‌బాబు ఎవరితోనైనా లవ్ చేస్తాడు, ఆ తర్వాత వదిలేస్తాడం``టూ వ్యాఖ్యానించారు. అది ఆయన నైజమన్నారు. మామ నుంచి అందరినీ ప్రేమించాడని, 1996 లో కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పాడని, ..అప్పటి నుంచి అన్ని పార్టీలతో లవ్ చేస్తాడన్నారు. ఆయన తర్వాత ఆయనేంటో చూపిస్తారని సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే.. సోము వ్యాఖ్య‌లపై విశ్లేష‌క‌లు కూడా రియాక్ట్ అయ్యారు. చంద్ర‌బాబు.. జ‌న‌సేన‌తో ఎక్క‌డ జ‌త క‌డ‌తారో.. అనే బెంగ‌తోనే సోము ఇలా వ్యాఖ్యానించి ఉంటార‌ని వారు అంటున్నారు.

వాస్త‌వానికి బీజేపీ ప‌రిస్థితిని తీసుకుంటే.. ఏపీలో పెద్ద‌గా బ‌లం లేదు. నాయ‌కులు మీడియా ముందుకు వ‌చ్చి.. నాలుగు మాట‌లు అనేసి ఇంటికే ప‌రిమిత‌మ‌వుతున్నార‌నే వాద‌న ఎప్ప‌టి నుంచో వినిపిస్తోంది. క్షేత్ర‌స్థాయిలో పార్టీ పుంజుకునేలా ఏ ఒక్క‌రూ కృషి చేయ‌డం లేదు. దీంతో పార్టీ ఇబ్బందిలోనే ఉంది. అయితే.. ప్ర‌స్తుతం జ‌న‌సేన‌ను చూసుకునే బీజేపీ నేత‌లు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌లోపేతం అవుతామ‌ని.. అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని చెబుతున్నారు. అంటే.. జ‌న‌సేన ఓటు బ్యాంకు త‌మ‌తో క‌లిసి వ‌స్తే.. త‌మ‌కు అధికారం వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన పొత్తు త‌మ‌తోనే ఉండాల‌ని వారు కోరుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా న‌ర్మ‌గ‌ర్భంగా జన‌సేన‌తో క‌లిసి వ‌స్తే.. త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించేస‌రికి.. బీజేపీ నేత‌లు బెంబేలెత్తుతున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. రేపు టీడీపీ.. జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే.. ఖ‌చ్చితంగా త‌మ‌కు ఎఫెక్ట్ అవుతుంద‌ని వారు బాధ‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంద‌న్నది విశ్లేష‌కుల మాట‌. అంటే.. మెజారిటీ సీట్లు ఆ రెండు పార్టీలో పంచుకుంటే.. త‌మ‌కు నాలుగైదు సీట్ల‌కు మించి కేటాయించే ప‌రిస్థితి ఉండ‌దు. అప్పుడు మ‌రోసారి 2014 సీన్ రిపీట్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. సంస్థాగ‌తంగా పార్టీకి ఉన్న సీట్ల‌లోనూ.. ఇప్పుడు బ‌లం త‌గ్గిన నేప‌థ్యంలో రేపు.. ఎక్క‌డ సీట్లు ఇస్తార‌నే భ‌యం కూడా ఉంది.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను చంద్ర‌బాబు ఎక్క‌డ మ‌చ్చిక చేసుకుంటాడో అనే బెంగ‌తో సోము ఇలా వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి బ‌లం లేని.. ఏపీలో అదికారంపై ఆశ‌లు పెట్టుకోవ‌డం.. బీజేపీ చేస్తున్న పెద్ద త‌ప్పుగా వారు చెబుతున్నారు. ముందు సంస్థాగ‌తంగా పార్టీని బ‌లోపేతం చేసుకోవాల్సి ఉన్న‌ప్ప‌టికీ..వారు దానిపై దృష్టి పెట్ట‌కుండా.. వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు. జ‌న‌సేన‌నున‌మ్ముకునే బీజేపీ నేత‌లు రాజ‌కీయాలు చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తున్న నేప‌థ్యంలో ఆ పార్టీని చంద్ర‌బాబు ఎక్క‌డ ఓన్ చేసుకుంటార‌నే బెంగ‌తోనే.. ఇప్పుడు సోము ఇలా వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌ని విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.