Begin typing your search above and press return to search.
జనసేనకు కొనసాగుతూ ఉన్న రాజీనామాలు!
By: Tupaki Desk | 13 Feb 2020 2:30 AM GMTపవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు రాజీనామాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే జనసేనకు రాజీనామాలు మొదలైన సంగతి తెలిసిందే. మరీ పవన్ కనీసం ఎమ్మెల్యేగా నెగ్గకపోవడంతోనే జనసేన అసలు కథ స్పష్టం అయిపోయింది. దీంతో వరసగా రాజీనామాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటీవలే ఆ పార్టీలో కీలకం అనుకున్న నేతలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన వి.లక్ష్మినారాయణ రాజీనామాతో జనసేనకు గట్టి ఝలక్కే తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ తరఫున నెగ్గిన ఏకైక ఎమ్మెల్యే రాపాక కూడా ఆ పార్టీకి దూరదూరంగానే కనిపిస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో రాజీనామాల వార్తలతో జనసేన నిలుస్తూ ఉంది. బీజేపీతో పొత్తు అంటూ పవన్ కల్యాణ్.. పార్టీ బాధ్యతలు సగం వరకూ దించేసుకున్నారు. ఇక రాజీనామాలతో జనసేన పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తాజాగా గాజువాక నియోజకవర్గం లో జనసేన కు రాజీనామాలు జరగడం గమనార్హం. అక్కడ ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారు రాజీనామాలు చేశారు. కరణం కనకారావు తో సహా దాదాపు రెండు వందల మంది జనసేన కార్యకర్తలు రాజీనామాలు చేశారు. విశేషం ఏమిటంటే వాళ్లంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం!
గాజువాక ఎమ్మెల్యే తిప్పాల నాగిరెడ్డి ఆధ్వర్యంలో వాళ్లంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గాజువాక నుంచి గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసిన సంగతి వేరే చెప్పనక్కర్లేదు. నాగిరెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. అప్పుడు జనసైనికులుగా పని చేసిన వాళ్లు.. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం గమనార్హం. పవన్ సినిమాల వైపుకు వెళ్లడం తో కాస్తో కూస్తో రాజకీయం మీద ఆసక్తి ఉన్న వాళ్లు జనసేనలో నిలిచే పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు.