Begin typing your search above and press return to search.
బీజేపీతో పొత్తు.. తేల్చేసిన జనసేన? ఉత్తరాంధ్ర ఎన్నికల్లో కీలక నిర్ణయం?
By: Tupaki Desk | 10 March 2023 3:07 PM GMTకీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బీజేపీ తో పొత్తు విషయం పై జనసేన ఒక నిర్ణయానికి వచ్చేసిందా? ఇప్పటి వరకు రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూసిన జనసేనాని పవన్ కళ్యాణ్.. ఇక, బీజేపీని వద్దనుకున్నారా? అంటే.. తాజాగా మారిన పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. వచ్చే 2024 సార్వత్రిక సమరానికి సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీలో వేడి పుట్టిస్తున్నాయి.
అధికార పార్టీ తనపై ప్రజలకు వ్యతిరేకత లేదని నిరూపించు కునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కొన్ని సాధించారు కూడా. అయితే.. ఇక, బీజేపీ, టీడీపీలు కూడా.. తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే సమయంలో జనసేన నేరుగా ఎవరికీ మద్దతివ్వలేదు. అయితే.. వైసీపీ కి వ్యతిరేకంగా మాత్రం ఓటేయాలని పిలుపునిచ్చింది.
దీంతో జనసేన మద్దతు తమకే ఉందని బీజేపీ నేతలు ప్రకటిస్తూ వచ్చారు. పొత్తులో భాగంగా జనసేన తమతోనే కలిసి నడుస్తుందని.. ఉత్తరాంధ్రలో మాధవ్ గెలుపు నల్లేరుపై నడకేనని సోము వీర్రాజు కూడా వ్యాఖ్యానించారు. అయితే.. ఇప్పుడుజనసేన ఈ విషయంలో పార్టీ నాయకులకుక్లారిటీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
జనసేన- బీజేపీ నేతల మధ్య సమన్వయం లేదని ప్రచారం జరుగుతోంది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్.. ఆ పార్టీ తరుపున ఉత్తరాంద్ర పట్టభద్రుల స్థానం నుంచి మళ్లీ గెలవాలని బీజేపీ పార్టీ కలలు కంటోంది.
కానీ.. మిత్రపక్షంగా ఉన్న జనసేన నేతలు ఎక్కడా బీజేపీకి టచ్‌లోకి రాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా బీజేపీ నేతలు కూడా జనసేనను ఆహ్వానించలేదు. దీంతో జనసేన అంతర్గత సమాచారం మేరకు టీడీపీకి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఇదిలావుంటే, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. టీడీపీ నుంచి వేపాడ చిరంజీవరావు, వైసీపీ నుంచి సీతంరాజు సుధాకర్, పీడీఎఫ్ బలపరిచిన రమాప్రభతోపాటు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ బరిలోకి దిగారు.