Begin typing your search above and press return to search.
బాబు చేయని పని చేస్తున్న పవన్.. ఎట్టకేలకు ప్రజల మధ్యకు పవన్
By: Tupaki Desk | 1 Dec 2020 6:15 AM GMTవిపత్తులు విరుచుకుపడినప్పుటు బాధిత ప్రజల్ని పరామర్శించేందుకు అధినేతలు ప్రజల ముందుకు వస్తుంటారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకోవటంతో పాటు.. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా కురిసిన భారీ వర్షాలతో ఏపీలోని పలు జిల్లాల్లో రైతులు భారీగా నష్టపోయారు. సాధారణంగా ఇలాంటివి చోటుచేసుకున్నంతనే టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత ఏదో ఒక పర్యటన పేరుతో.. బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు.
అందుకు భిన్నంగా ఈసారి బాబు నుంచి ప్రకటన విడుదల కాక ముందే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రైతుల వద్దకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి రైతుల సమస్యల్ని తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తానని చెప్పినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇదిలాఉంటే.. ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన రైతుల వెతల్నితెలుసుకునేందుకు టూర్ సిద్ధం చేసుకున్నారు పవన్.
తొలుత క్రిష్ణా.. గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తారు. ఆయన పరామర్శల కార్యక్రమం రేపటి నుంచి (బుధవారం) ప్రారంభం కానుంది. మూడు..నాలుగైదు తేదీల్లో చిత్తూరు.. నెల్లూరు జిల్లాల్లో పవన్ పర్యటన ఉండనుంది. తుపాను కారణంగా నష్టపోయిన రైతుల్ని కలవటమే కాదు.. వారికి జరిగిన పంట నష్టం లెక్కల్ని తెలుసుకోనున్నారు.
పవన్ కల్యాణ్ పర్యటించే ప్రాంతాల్ని చూస్తే..
- పామర్రు
- చల్లపల్లి
- అవనిగడ్డ
- భట్టిప్రోలు
- చావలి
- పెరవలి
- తెనాలి
- నందివెలుగు
- కొలకలూరు
- నాయుడుపేట
- గూడూరు
- రాపూరు
- వెంకటగిరి