Begin typing your search above and press return to search.

ఓటు వేసిన పవన్.. ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   10 March 2021 5:30 AM GMT
ఓటు వేసిన పవన్.. ఎక్కడంటే?
X
ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు కీలకమైన పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పోటాపోటీగా ప్రచారం చేసిన వేళ.. పార్టీ గుర్తుతో జరిగే ఈ ఎన్నికల ఫలితాలు ఏపీ భవిష్యత్ రాజకీయాల్ని ప్రభావితం చేయనున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ రోజు జరుగుతున్న పోలింగ్ కు ఉదయాన్నే తన ఓటుహక్కును వినియోగించుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

ఈ రోజు (బుధవారం) ఉదయమే ఆయన తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. విజయవాడలోని పటమట లంక జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్ పోలింగ్ బూత్ నెంబరు 4లో తన ఓటును వినియోగించుకున్నారు. పవన్ తో పాటు ఎమ్మెల్సీ అశోక్ బాబు.. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజులు కూడా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.