Begin typing your search above and press return to search.
జానాకు నల్లకళ్లజోడు.. ఏమైంది?
By: Tupaki Desk | 11 Sept 2018 10:41 AM ISTముందస్తు ఎన్నికలకు కేసీఆర్ పచ్చజెండా ఊపటం.. ఆ తర్వాత వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలిసిందే. ఒకటి తర్వాత మరొకటి చొప్పున తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మారిన రాజకీయపరిస్థితుల్లో ఎడాపెడా ప్రెస్ మీట్లను నేతలు పెట్టేస్తున్నారు. అయితే.. ఇవన్నీ విపక్షాల ప్రెస్ మీట్లు మాత్రమే కానీ.. టీఆర్ ఎస్ కు చెందినవి ఏ మాత్రం లేవు.
తాజాగా ఇదే తరహాలో ఒక ప్రెస్ మీట్ ను కాంగ్రెస్ నేతలు పెట్టారు. దీనికి తాజా మాజీ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి హాజరయ్యారు. ఎప్పుడూ లేని రీతిలో ఆయన తన కళ్లకు నల్లకళ్లజోడు పెట్టుకొని రావటం అందరి దృష్టిని ఆకర్షించింది. నల్లకళ్లద్దాల వెనుక కారణమేమిటంటూ కొందరు ఆరా తీయటం కనిపించింది.
కంటికి సంబంధించిన ఇన్ ఫెక్షన్ తో జానా బాధ పడుతున్నారని.. సూర్య కిరణాలు కంటి మీద పడకుండా ఉండేందుకు వీలుగా వైద్యుల సలహా మేరకు నల్లకళ్లద్దాల్ని పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. కీలకమైన ఎన్నికల వేళ.. ఇలాంటి ఇబ్బందులు రావటం ఏంది జానాసాబ్?