Begin typing your search above and press return to search.

హరీశ్ కు పంచ్ వేసిన జానా

By:  Tupaki Desk   |   22 Dec 2016 11:25 AM IST
హరీశ్ కు పంచ్ వేసిన జానా
X
ఎంత బాగా మాట్లాడటం వచ్చినా.. కొన్ని సందర్భాల్లో నోట మాట రాని పరిస్థితి ఉంటుంది. ఇంచుమించు అలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి.. ఫైర్ బ్రాండ్ హరీశ్ రావు. మాట ఎలాంటిదైనా.. తనకు అనుకూలంగా మార్చుకోవటంలో ఆయనకు ఆయనే సాటి. మాటల మాంత్రికుడైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత.. ఆ స్థాయిలో మాట్లాడే అతి కొద్దిమందిలో హరీశ్ ముందుంటారు.

అలాంటి హరీశ్ నోట మాట రాని విధంగా కౌంటర్ వేశారు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి. వ్యవసాయం మీదజరిగిన చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా మంత్రి హరీశ్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా తన మాటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సంపత్ పేర్లను ఉదహరించారు. దీంతో.. హరీశ్ చేసిన విమర్శలకు సమాధానం చెప్పేందుకు తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ నేతలు కోరారు.

అయితే.. అందుకు సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ అంగీకరించలేదు. దీంతో సభలో కాసేపు గందరగోళం ఏర్పడింది. దీన్ని చక్కదిద్దేందుకు వీలుగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. తమ వారిపై అధికారపక్ష నేతలు చేస్తున్న మాటల దాడిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జానారెడ్డి.. మంత్రి హరీశ్ పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.

ప్రతిపక్ష సభ్యలు మాట్లాడిన అంశాలన్నింటినీ నోట్ చేసుకొని.. ఆ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందనే అంశంపైనే మంత్రులు వివరణ ఇవ్వాలని.. అంతేకానీ మంత్రులు మధ్యలో జోక్యం చేసుకోకూడదన్నారు. ‘‘హరీశ్ కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడిన మాటలకు నాకూ కూడా కౌంటర్ ఇవ్వాలని ఉంది. నువ్వు లేచి నేను లేచి.. నువ్వు కౌంటర్ ఇచ్చి.. నేను కౌంటర్ ఇచ్చి.. ఇలా దానికే టైం సరిపోతుంది. అంతా అయ్యాకే మంత్రులు మాట్లాడాలి. ఇది గతం నుంచి వస్తున్న సంప్రదాయం’’ అంటూ జానా ప్రదర్శించిన ధర్మాగ్రహం హరీశ్ మీద ప్రభావం చూపించిందన్న భావన వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/