Begin typing your search above and press return to search.
మోడీ హయాంలో తొలి ఘనవిజయం ఇదేనా?!
By: Tupaki Desk | 21 Jan 2015 4:54 AM GMTప్రధానమంత్రి జన్‌ధన్ యోజన.. దేశంలోని ప్రజలందరినీ బ్యాంకింగ్ వ్యవస్థలో భాగం చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం. మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న ప్రోగ్రామ్. ఈ కార్యక్రమాన్ని అమల్లో పెట్టడంలో మోడీ సర్కారు విజయవంతం కూడా అయ్యింది. రానున్న రిపబ్లిక్ డే ను గడువుగా ఉన్న ఈ కార్యక్రమం గడువుకు ముందే విజయవంతం అవుతున్నట్టుగా తెలుస్తోంది.
జన్‌ధన్‌యోజనతో ఇప్పటి వరకూ దాదాపు 99.74 శాతం కుటుంబాలు బ్యాంకింగ్ వ్యవస్థ పరిధిలోకి వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకుల్లో అకౌంట్లను ప్రారంభించే అవకాశాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమం ద్వారా. గత స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమానికి వచ్చే రిపబ్లిక్ డే వరకూ గడువు ఉంది. మొత్తం పది కోట్ల మంది చేత ఆకౌంట్లను ప్రారంభించాలనేది లక్ష్యం. ఈ పది కోట్ల మంది చేతా అకౌంట్లను ప్రారంభింపజేయడం ద్వారా దాదాపు దేశంలోని అన్ని కుటుంబాలూ ఆర్థిక వ్యవస్థ పరిధిలోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.
రికార్డు స్థాయిలో అకౌంట్లను ప్రారంభింపజేయడం ద్వారా గిన్నిస్ బుక్‌లో కూడా స్థానం సంపాదించారు. మరి ఈ కార్యక్రమం దాదాపుగా విజయవంతం అయినట్టుగానే చెప్పవచ్చు.
అయితే జీరో బ్యాలెన్స్‌తో అకౌంట్ల ద్వారా ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థలో భాగం చేశారు కానీ ఆ అకౌంట్ల నిర్వహణ ఏ స్థాయిలో ఉంటుంది.. అనేది ప్రశ్నార్థకం. అకౌంట్లను ప్రారంభిస్తే చాలదు కదా.. వాటితో లావాదేవీలు జరిపే శక్తి ప్రజలకు ఉండాలి. అప్పుడు జన్‌ధన్ యోజనకు సార్థకత. ఇందుకోసం మోడీ సర్కార్ ఏం చేస్తుందో!