Begin typing your search above and press return to search.
ఆర్మీ అధికారికి క్లారిటీ...రాష్ట్రంలో గవర్నర్ పాలన
By: Tupaki Desk | 15 May 2017 4:08 PM GMTకొద్దిరోజులుగా తీవ్రకల్లోలంగా ఉన్న జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు చక్కదిద్దేందుకు సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు త్వరలోనే గవర్నర్ పాలన విధిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు సైతం గవర్నర్ పాలన విషయంలో పూర్తి సానుకూలతతో ఉండటం ఆసక్తికరం. బీజేపీని మట్టికరిపిస్తామని, ఆ పార్టీని రాష్ట్రం నుంచే తరిమేస్తామన్న ప్రచారంతో ఎన్నికల్లో పోటీ చేసిన పీడీపీ, ఆతర్వాత అదే పార్టీతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకం, ద్వేషం కారణంగానే శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని, ఆ ప్రభుత్వం అధికారంలో లేకపోయినట్లయితే సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ పాలన విధించినట్లయితే రాష్ట్రంలో కచ్చితంగా శాంతియుత పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తున్నారు.
ఇటీవల జరిగిన శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నిక తర్వాత గవర్నర్ పాలన డిమాండ్ తారాస్థాయికి చేరడం గమనార్హం. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లా రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఆసక్తికరంగా ఫరూక్ అబ్దుల్లా డిమాండ్‌కు కేంద్రంలోని, రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు మద్దతిచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సైతం ఫరూక్ అబ్దుల్లా కామెంట్లకు మద్దతుగా మరో సందర్భంలో మాట్లాడటం విశేషం. కశ్మీర్‌లోని పీడీపీ, బీజేపీ సంకీర్ణ కూటమిలో చీలిక కనిపిస్తోందని, అదే కనుక జరిగితే గవర్నర్ పాలన విధించక తప్పదని ఆయన వ్యాఖ్యానించడంతో బీజేపీ సైతం గవర్నర్ పాలన విషయంలో ఆసక్తిగా ఉందని అంటున్నారు. రాష్ట్రంలో గవర్నర్ పాలనను విధిస్తే అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచవచ్చు లేదా మొత్తానికి రద్దు చేయవచ్చు. ఒకసారి ఆరు నెలలకు మించి గవర్నర్ పాలనను విధించడానికి వీల్లేదు. అయితే ప్రతి ఆరునెలలకోసారి పొడిగిస్తూ వెళ్లవచ్చు. 1977 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరుసార్లు గవర్నర్ పాలనను విధించగా, ఇటీవలి కాలంలో 2016లో అప్పటి ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ మృతితో గవర్నర్ పాలనను విధించాల్సి వచ్చింది.
కాగా, కొద్దికాలం క్రితం ఆందోళనకారుల రాళ్లదాడి నుంచి తప్పించుకోవడానికి ఆర్మీ జీపునకు ఓ వ్యక్తిని మానవ కవచంగా కట్టేసిన విషయం తెలిసిందే కదా. ఏప్రిల్ 9న కశ్మీర్‌లోని బుద్గామ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై మిశ్రమ స్పందన వచ్చింది. ఈ నిర్ణయం తీసుకున్న మేజర్ నితిన్ గొగోల్‌ను కొందరు సమర్థించగా.. మరికొందరు విమర్శించారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆర్మీ విచారణకు ఆదేశించింది. అయితే ఈ ఘటనపై విచారణ జరుపుతున్న ఆర్మీ కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీ మాత్రం ఆయన చర్యను సమర్థించడమే కాదు.. నితిన్‌పై ప్రశంసలు కురిపించింది. ఎలాంటి గాయాలు, క్షతగాత్రులు లేకుండా చేయడానికి నితిన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసించదగినదే అని ఆర్మీ కోర్టు అభిప్రాయపడింది.