Begin typing your search above and press return to search.

క్రికెట్ గ్రౌండ్ గా క్వారంటైన్‌ సెంటర్ !

By:  Tupaki Desk   |   10 Jun 2020 2:00 PM GMT
క్రికెట్ గ్రౌండ్ గా క్వారంటైన్‌ సెంటర్ !
X
ఈ సువిశాలమైన భారదేశంలో ఎవరికీ ఇష్టం వచ్చినట్టు వారు ఉండచ్చు. భారత రాజ్యాంగం భారత పౌరులకు ఆ అవకాశాన్ని అందించింది. దీన్ని ప్రతి ఒక్కరూ వాడుకుంటుంటారు. తాజాగా క్వారంటైన్ సెంటర్లో ఉన్నవారు కూడా స్వేచ్ఛను కోరుకుంటున్నారు. క్వారంటైన్ సెంటర్లలో రోజులకు రోజులు నాలుగు గోడల మధ్య ఖాళీగా ఉండటం అంటే అనుకున్నంత సులభం అయితే కాదు. కానీ, క్వారంటైన్‌ సెంటర్ల లో కూడా కొంతమంది తమకు తోచినట్లుగా టైం పాస్‌ చేయటం.. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టటం ఈ మధ్య పరిపాటిగా మారింది.

తాజాగా క్వారంటైన్‌ టైంపాస్‌ వీడియో ఒ‍కటి సోషల్‌ మీడియాలో వైరల్ ‌గా మారింది. ఆ వీడియో లో జమ్మూకశ్మీర్ ‌లోని ఓ క్వారంటైన్‌ సెంటర్ ‌లో రోగులు చక్కగా క్రికెట్‌ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోను జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్ధుల్లా ఆ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. స్థలం ఉంది.. ఆడుకోండి.. క్వారంటైన్‌ టైం పాస్‌ అని తెలిపారు. ఈ వీడియో గంటల వ్యవధిలోనే కొన్ని వేల వ్యూస్ ‌ను సొంతం చేసుకుంది.

దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మనదేశంలో వైరస్ పాజిటివ్ కేసులు పెరగటంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు.. క్లిష్ట సమయంలో కూడా మన భారతీయులు వినోదం కోసం ఏదో ఒకదాన్ని అన్వేషిస్తూనే ఉంటారు. అసలు క్వారంటైన్‌ అన్న పదానికి అర్థాన్నే పూర్తిగా మార్చేశారు. క్రికెట్ గ్రౌండ్ గా క్వారంటైన్‌ సెంటర్ ను మార్చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.