Begin typing your search above and press return to search.
జమిలి ఎన్నికలు : మోడి చెప్పినంత ఈజీ కాదు
By: Tupaki Desk | 26 Nov 2020 5:40 PM GMTఅప్పుడెప్పుడో వదిలిపెట్టేసిన జమిలి ఎన్నికల అంశాన్ని తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడి మళ్ళీ ప్రస్తావించారు. ఈమధ్యనే బీహార్ ఎన్నికలతో పాటు మరికొన్ని అసెంబ్లీల్లో మెజారిటి సీట్లను బీజేపీ గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా సాధించిన విజయం ఊపు వల్ల మళ్ళీ జమిలి ఎన్నికల విషయాన్ని ప్రస్తావించారు. నిజానికి మోడి చాలా కాలం క్రితమే జమిలి ఎన్నికలు జరిగితేనే దేశానికి మంచిందని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.
అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని ఎన్నికల్లో కమలంపార్టీకి పెద్దగా విజయాలు రాలేదు. అదే సమయంలో జమిలి ఎన్నికలపై అనేక రాష్ట్రాల నుండి చాలా అభ్యంతరాలే వచ్చాయి. దాంతో ఇదే విషయంపై కేంద్ర ఎన్నికల కమీషన్ రాజకీయ పార్టీలతో ప్రత్యేకంగా సమావేశమైంది. సమావేశంలో అనేక పార్టీలు అనేక అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. మెజారిటి పార్టీలు జమిలి ఎన్నికలు సాధ్యం కాదనే విషయాన్ని ప్రస్తావించాయి.
ఇదే సందర్భంలో కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తమ అనుమానాలను, అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. దాంతో అందరి అభిప్రాయాలను తెలుసుకున్న కమీషన్ కూడా జమిలి ఎన్నికలు సాధ్యం కాదని ప్రకటించేసింది. దేశంలో ఎప్పుడూ ఎక్కడో ఓ చోట ఎన్నికలు జరుగుతుంటాయన్న మాట వాస్తవమే. ఎన్నికల వల్ల అభివృద్ధి ఆగిపోతోందన్నది కూడా వాస్తవమే. కానీ అదే సమయంలో ఒక్కో రాష్ట్రానికి జరిగిన ఎన్నికల కారణంగా షెడ్యూల్ గడువు ఒక్కోరకంగా ఉంది. అలాకాదని అన్నీ రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే సాకేంతికంగా ఇబ్బందులున్నాయి.
జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన షెడ్యూల్ కు దగ్గరలోనే ఉన్న ప్రభుత్వాలు ఓకే చెబుతాయి. కానీ జమిలి ఎన్నికల షెడ్యూల్ కు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కు మధ్య చాలా గ్యాప్ ఉన్నపుడు ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసుకునేందుకు అధికారపార్టీ అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే గడువుకన్నా ముందే ఎవరు తమ ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవటానికి ఇష్టపడకపోవచ్చు. మోడి మాటను కాదనలేక బీజేపీ పాలిత రాష్ట్రాలు ఓకే అన్నా బీజేపీ వ్యతిరేక పార్టీల ప్రభుత్వాలు మాత్రం ఎట్టి పరిస్ధితుల్లోను అంగీకరించవనే అనుమానంగా ఉంది.
జమిలి ఎన్నికలు పెట్టాలంటే ముందుగా దీనికి సంబంధించి కేంద్రప్రభుత్వం ఓ డ్రాఫ్టును తయారు చేయాలి. దాన్ని రాజకీయ పార్టీల ఆమోదించాలి. ఏదన్నా సవరణలు ప్రతిపాదిస్తే దాన్ని కేంద్రం అమోదించాలి. తర్వాత ఫైనల్ డ్రాఫ్టును దేశంలోని అన్నీ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆమోదించాలి. అన్నీ కాకపోయినా కనీసం మెజారిటి రాష్ట్రాల అసెంబ్లీలన్నా ఆమోదించాలి. ఆ తర్వాత పార్లమెంటులో బిల్లు రూపంలో ప్రవేశపెట్టి చర్చించాలి. ఉభయ సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి సంతకం అవ్వాలి. అప్పుడు జమిలి ఎన్నికలకు కేంద్రం ఓ తేదీని నిర్ణయిస్తుంది. ఈలోగా ఈ ప్రక్రియపై ఎవరు కోర్టులో కేసులు వేయకుండా ఉండాలి.
అంటే జమిలి ఎన్నికలు అన్నది మోడి చెబుతున్నంత ఈజీ కాదు. అదే సమయంలో కష్టమూ కాదు. కాకపోతే గడువుకన్నా తమ ప్రభుత్వాలను రద్దు చేసుకునేంత విశాల హ్రుదయం ఉండాలి అధికారపార్టీలకు. 1960వ దశకం ముందు దేశంలో నాలుగుసార్లు జమిలి ఎన్నికలే జరిగాయి. కానీ తర్వాత గతి తప్పింది. ఎందుకంటే ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోయి మధ్యతర ఎన్నికలు వస్తే అప్పుడేమి చేయాలి ? అన్న ప్రశ్నకు ఎవరి దగ్గర నుండి సమాధానం రావటం లేదు. చూద్దాం తాజాగా మోడి లేవనెత్తిన జమిలి అంశానికి ఎటువంటి స్పందన వస్తుందో.