Begin typing your search above and press return to search.
టైటానిక్ మునిగిన చోటికి 33సార్లు వెళ్లాను: కామెరూన్
By: Tupaki Desk | 23 Jun 2023 9:05 AM GMTటైటాన్ జలాంతర్గామి ప్రయాణీకులు సహా సముద్ర గర్భంలో అదృశ్యమైందని నివేదికలు ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. జలాంతర్గామి సంస్థ ఓషియన్ గేట్ ఇటీవల విడుదల చేసిన అధికారిక ప్రకటనలో టైటాన్ సబ్ దానిలో ఉన్న ఐదుగురు పర్యాటకులతో పాటు తప్పిపోయినట్లు వెల్లడించింది. యావత్ ప్రపంచంతో పాటు టైటానిక్ చరిత్రతో ఎంతో అనుబంధం ఉన్న ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దురదృష్టకర ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
పాక్ కు చెందిన వ్యాపారవేత్త షాజాదా దావూద్ అతని కుమారుడు సులేమాన్ దావూద్... బ్రిటీష్ సాహసికుడు హమీష్ హార్డింగ్ ... ఫ్రెంచ్ డీప్ సీ ఎక్స్ ప్లోరర్ ఈ జలాంతర్గామిలో ఉన్నారు. టైటానిక్ నిపుణుడు పాల్-హెన్రీ నార్గోలెట్ ఈ జలాంతర్గామికి పైలట్ గా ఉండగా....ఓషియన్ గేట్ CEO స్టాక్ టన్ రష్ కూడా ఈ ప్రయాణీకుల్లో ఉన్నారు. అయితే సముద్ర గర్భంలో తీవ్ర పీడనం వల్ల జలాంతర్గామి పేలిపోయిందని ఐదుగురు ప్రయాణీకులు మరణించారని కోస్ట్ గార్డ్ ప్రకటించడంతో దీనిపై స్పష్ఠత వచ్చింది.
తప్పిపోయి అంతమైన టైటాన్ జలాంతర్గామిపై జేమ్స్ కామెరూన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల ABC న్యూస్ తో మాట్లాడిన జేమ్స్ కామెరూన్ తప్పిపోయిన టైటాన్ జలాంతర్గామిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఈ నష్టం పెద్దది... తప్పిపోయిన వారిని కనుగొనడం అసాధ్యం! అని పేర్కొన్నారు. ''కమ్యూనిటీలోని కొందరు ఈ జలాంతర్గామి గురించి చాలా ఆందోళన చెందారు. డీప్ సబ్ మెర్జెన్స్ ఇంజినీరింగ్ కమ్యూనిటీలోని కొంతమంది అగ్రశ్రేణి సభ్యులు ఓసిగేట్ కంపెనీకి లేఖలు కూడా రాశారు. వారు చేస్తున్నది చాలా ప్రయోగాత్మకం'' అని జేమ్స్ కామెరూన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. .
ఇటీవల జరిగిన ప్రమాదం అసలైన టైటానిక్ విషాదానికి మధ్య ఉన్న పోలికలపై దర్శకుడు కామెరూన్ ముచ్చటించారు. 1912 ఏప్రిల్ 14 - 15 తేదీల మధ్య జరిగిన దురదృష్టకర సంఘటన అసలైన టైటానిక్ విషాదానికి మధ్య ఉన్న సారూప్యతలను కూడా ఎత్తి చూపారు. టైటానిక్ విపత్తు.. ఈ సంఘటన మధ్య ఉన్న సారూప్యతను చూసి నేను ఆశ్చర్యపోయాను. నిజానికి టైటానిక్ కెప్టెన్ పదే పదే హెచ్చరించాడు. ఓడ ముందు మంచు ఉంది. అయినప్పటికీ ఓడ చంద్రుడు లేని రాత్రి మంచు ఫీల్డ్ లోకి పూర్తి వేగంతో ఆవిరిలోకి ప్రవేశించింది. చాలా మంది మరణించారు. హెచ్చరికలు పట్టించుకోకుండా జరిగిపోయిన ఇలాంటి విషాదం మరువలేనిది. అన్నింటి కంటే అదే కచ్చితమైన ప్రదేశంలో ఇలాంటి విషాదం జరగడం నమ్మశక్యం కానిదిగా నేను భావిస్తున్నాను.. ప్రపంచవ్యాప్త డైవర్లను ఇది ఆశ్చర్యపరుస్తుంది! అని జేమ్స్ కామెరూన్ అన్నారు.
టైటానిక్ అన్వేషకుడు పాల్ హెన్రీ గురించి జేమ్స్ కామెరాన్
టైటాన్ జలాంతర్గామితో అదృశ్యమైన టైటానిక్ అన్వేషకుడు పాల్ హెన్రీ గత 25 సంవత్సరాలుగా జేమ్స్ కామెరూన్ కు స్నేహితుడు. ఫ్రెంచ్ లెజెండరీ సబ్ మెర్సిబుల్ డైవ్ పైలట్ పాల్ హెన్రీ నాకు స్నేహితుడు. ''మీకు తెలుసా ? ఇది చాలా చిన్న సంఘం. నాకు PH (అతని స్నేహితులలో అతని ముద్దుపేరు) 25 సంవత్సరాలుగా తెలుసు. అతను ఇందులో విషాదకరంగా మరణించాడు. నేను అతడిని వెతకడం దాదాపు అసాధ్యం''అని కామెరూన్ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేసారు.
33 సార్లు అదే చోటికి వెళ్లిన కామెరూన్
ఈ భూమ్మీద అత్యంత క్రూరమైన ప్రదేశమదని కామెరూన్ వ్యాఖ్యానించారు. మునిగిపోయిన టైటానిక్ దగ్గరకు 33 సార్లు తాను వెళ్లానని గుర్తు చేసుకున్నారు. అదొక ప్రమాదకరమైన ప్రాంతంగా అభివర్ణించారు.
సాహసాలు ఇష్టపడతాను. కొత్త ప్రదేశాలు కనుగొనాలనుకుంటాను. అందుకే టైటానిక్ షిప్ (రెకేజ్ సైట్) ప్రాంతాన్ని ఇప్పటివరకూ 33సార్లు సందర్శించానని తెలిపారు. 13వేల అడుగుల లోతున నిలిచిన చరిత్ర సజీవ సాక్ష్యాన్ని ఆయన డాక్యుమెంటరీగాను రూపొందించారు. మనుషులు ఎప్పుడూ చూడని ప్రదేశాలను చూడటమంటే ఆసక్తి.. అందుకే ఆ ప్రాంతానికి వెళ్లానని కామెరూపన్ చెప్పారు.
అంతేకాదు సముద్రగర్భం ఇతివృత్తంగా ఎక్స్ పెడిషన్: బిస్‌మర్క్-ఘోస్ట్స్ ఆఫ్ ది అబేస్ అండ్ ఏలియన్స్ ఆఫ్ ది డీప్ వంటి డ్యాకుమెంటరీల చిత్రాలను ఆయన తీశారు. అలాగే భారీ ఓడ మునిగిన ప్రాంతాన్ని చూడాలనే ఆకాంక్షతోనే టైటానిక్ చిత్రాన్ని తెరకెక్కించానని కూడా కామెరూన్ అన్నారు. టైటానిక్ సినిమా నిర్మాణాన్ని నేను సాహసయాత్రగా భావిస్తాను. ఇలాంటి సినిమాల నిర్మాణాల కోసం నిరంతరం కృషిచేస్తానని అన్నారు. 1995లో తొలిసారి ఓ రష్యన్ సబ్‌మెరైన్‌లో ప్రయాణించి టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని వీడియో చిత్రీకరించి తీసుకొచ్చారు.
ఇక నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కోసం పసిఫిక్ సముద్రంలోని మెరైనా ట్రెంచ్ అడుగు భాగానికి ఒక్కరే వెళ్లి చరిత్ర సృష్టించారు. అక్కడ ఏం జరిగినా ఎవరూ రక్షించడానికి ఉండరు. నేనొక్కడినే ఈ గ్రహంపై ఉన్నానా? అనుకున్నాను!అంటూ తన ధైర్యాన్ని కామెరూన్ చాటుకున్నారు.