Begin typing your search above and press return to search.

జలీల్ ఖాన్ తో జాగ్రత్త.. నాలుక కోసేస్తాడట

By:  Tupaki Desk   |   16 Sept 2016 3:14 PM IST
జలీల్ ఖాన్ తో జాగ్రత్త.. నాలుక కోసేస్తాడట
X
వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పెద్దపెద్ద మాటలు చెప్పడం సిద్ధహస్తుడునని మరోసారి నిరూపించుకున్నారు. అయితే... గతాన్ని మరిచిన ఆయన వైసీపీపై ఘాటైన విమర్శలు చేశారు. విజయవాడ మొత్తం టీడీపీమయం అయిందని ఆనందం వ్యక్తం చేస్తూ... ఆ ఆనందంలో ఆయన భారీభారీ డైలాగులు చెప్పడంతో అవి ఇప్పుడు విమర్శలకు దారి తీస్తున్నాయి. దేవినేని చేరికతో కృష్ణా జిల్లా అంతా టీడీపీయే ఉందని, ఇకపై ఎవరైనా ఎదురు మాట్లాడితే నాలుక కోస్తామని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాను ఇంతకుముందు ఎయిర్‌ పోర్టు నుంచి వెళ్తుంటే దేవినేని నెహ్రూ ఇంటి వైపు చూసేవాడినని.. అక్కడ కూడా పసుపు రంగు కళకళలాడితే విజయవాడ మొత్తం టీడీపీకే అంకితం అయిపోతుందని అనుకునే వాడినన్నారు. ఆ కోరిక ఇప్పుడు నెరవేరిందన్నారు. దేవినేని నెహ్రు కోసం జగన్ పార్టీ కూడా ట్రై చేశారని.. అయితే, అటువైపు వెళ్లొద్దని తానే చెప్పానని జలీల్ చెప్పుకొచ్చారు.

అలాగే తాను పార్టీ మారేందుకు 30కోట్లు తీసుకున్నానని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని.. కానీ తనకు చంద్రబాబు 30 పైసలు కూడా ఇవ్వలేదని చెప్పారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి - ఆయన అనుచరులు కలిసి రాష్ట్రాన్ని దోచేశారని జలీల్‌ ఖాన్ ఆరోపంచారు. నెహ్రూకు ఉన్న రాజకీయ అనుభవం ముందు వైసీపీ ఎంతని ప్రశ్నించిన ఆయన, టీడీపీలో ఆయన చేరికను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. మరి గతంలో జలీల్ వైసీపీలో ఉన్నప్పుడు ఈ అనుభవాల సంగతేమైందో ఆయనే చెప్పాలి.