Begin typing your search above and press return to search.
మోడీ సీన్లోకి వస్తే కానీ అతడి పెళ్లి అయ్యేట్లు లేదు
By: Tupaki Desk | 28 Jun 2020 12:00 PM GMTఒక వ్యక్తి పెళ్లి కోసం దేశ ప్రధాని కల్పించుకుంటే కానీ కాదా? మరీ.. ఎటకారం కాకపోతే అనిపించొచ్చు. కానీ.. అతగాడి పరిస్థితి మొత్తం తెలిస్తే.. నిజమే.. మోడీ మాష్టారు కాస్త కల్పించుకుంటే బాగుండన్న భావన కలగటం ఖాయం. ఇంతకీ ఒక సామాన్యుడి పెళ్లికి.. ప్రధాని మోడీకి లింకేమిటి? అన్న విషయంలోకి వెళితే..
అబ్బాయిది పంజాబ్ లోని జలంధర్. పేరు కమల్ కల్యాణ్. అమ్మాయిది పాకిస్తాన్. లాహోర్ కు చెందిన ఆమె పేరు షుమైలా. దక్షిణ భారతాన ఉండే వారికి ఈ పెళ్లిళ్లు కాస్త కొత్తగా ఉంటాయి కానీ.. సరిహద్దు రాష్ట్రాల్లో ఇలా పెళ్లిళ్లు చేసుకోవటం అక్కడక్కడా జరుగుతూనే ఉంటాయి. ఐదేళ్ల క్రితం బంధువుల ఇంట్లో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ ఒకరినొకరు వీడియో కాల్ లో చూసుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలు కూడా ఓకే అనుకున్నారు.
ఇది జరిగిన మూడేళ్లకు వీడియోకాల్ లోనే ఇద్దరి ఎంగేజ్ మెంట్ పూర్తైంది. పెళ్లి ముహుర్తాన్ని ఈ ఏడాది మొదట్లో అనుకున్నారు. పెళ్లి పనులు మొదలైన వేళలో కరోనా ఎంట్రీ ఇచ్చింది. పెళ్లికి పెళ్లి కుమార్తె..ఆమె తరఫు వారు భారత్ కు రావటానికి వీలుగా స్పాన్సర్ షిప్ లెటర్ పంపాడు. అయితే.. అది కాస్తా డెలివరీ కాలేదు.
లాక్ డౌన్ కారణంగా భారత్ లోనూ.. పాక్ లోనూ కొరియర్ సర్వీసులు నిలిచిపోవటంతో వారు భారత్ కు రాలేని పరిస్థితి. ఇలా.. తన పెళ్లికి కరోనా అడ్డుగా నిలవటం.. రానున్న రోజుల్లోనూ పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం లేని నేపథ్యంలో.. ప్రధాని మోడీ కల్పించుకుంటే తమ పెళ్లి అవుతుందన్న ఆశలో ఉన్నాడు కమల్. మరి.. వారిద్దరి పెళ్లికి మోడీ పెద్ద మనసుతో ఓకే చెబుతారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.