Begin typing your search above and press return to search.
ఒరిజనలే..అమ్మకు తెలీకుండా తీసిన వీడియో!
By: Tupaki Desk | 22 Dec 2017 7:54 AM GMTఅనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన తర్వాత అమ్మను చూడాలనుకున్న వారికి.. ఆమె మరణం తర్వాత మాత్రమే ఆమెను చూసే అవకాశం లభించింది. అన్నేసి రోజులు ఆసుపత్రిలో ఉన్నప్పటికీ.. ఆమెకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. ఆమెకు కాళ్లు తీసేశారని.. ఆమె స్పృహలో లేరని.. ఇలా చాలానే మాటలు ప్రచారంలోకి వచ్చాయి. ఇంతకీ ఆసుపత్రిలో అమ్మ ఎలా ఉన్నారు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారన్న దానిపై ఎవరికి అవగాహన లేదు.
ఆ కొరతను తీరుస్తూ.. ఆర్కే నగర్ ఎన్నికల పోలింగ్ కు ఒక్కరోజు ముందు 20 సెకన్ల నిడివి ఉన్న వీడియోను విడుదల చేశారు చిన్నమ్మ మేనల్లుడు దినకరన్ కు క్లోజ్ గా ఉండే ఎమ్మెల్యే ఒకరు. ఈ వీడియోపై ఈసీ కస్సు మంది. మీడియా ఈ వీడియోను ప్రసారం చేస్తే ఊరుకునేది లేదంటూ ఫర్మానా జారీ చేసింది.
కోట్లాది మంది ఆసుపత్రిలో ఉన్న అమ్మను చూడాలని ఆరాటపడినా విడుదల చేయని చిన్నమ్మ అండ్ కో.. పోలింగ్ ముందు రోజు మాత్రం ఎవరూ అడగకుండానే రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చేశారు. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం తెలిసిందే. నీరసంగా ఉన్న అమ్మ.. ఏదో జ్యూస్ తాగుతున్న వీడియో అసలుదేనా? నకిలీదా? అన్న డౌట్లు పలువురు వ్యక్తం చేశారు.
అయితే.. ఈ వీడియోను టెస్ట్ చేసిన నిపుణులు ఇది ఒరిజినల్ గా తేల్చారు. అంతేకాదు.. ఈ వీడియోకు సంబంధించి తాజాగా కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఈ వీడియోను అమ్మకు తెలీకుండా తీశారని.. ఆమె రూంలో టీవీ చూస్తున్నప్పుడు తీసి ఉంటారని చెబుతున్నారు. తనను వీడియో తీస్తున్న విషయం అమ్మకు తెలిసే చాన్స్ లేదన్న మాటను చెబుతున్నారు.