Begin typing your search above and press return to search.
దేశంలోనే తొలిసారి.. జగన్ ఎమ్మెల్సీ ప్రమాణస్వీకారంతోనే రికార్డు
By: Tupaki Desk | 7 Oct 2020 4:30 AM GMTకొన్నిసార్లు అంతే. అరుదైన రికార్డులు కొందరి సొంతమవుతుంటాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తాజాగా అమలు కావటంతోనే.. దేశంలోనే అరుదైన రికార్డు నెలకొల్పినట్లైంది. ఇంతకూ అదేం నిర్ణయం అన్న విషయంలోకి వెళితే.. గవర్నర్ కోటాలో తాజాగా ఎన్నికైన ఏపీ ఎమ్మెల్సీ సభ్యుల్ని మండలి ఛైర్మన్ ఏఎండీ షరీఫ్ తన ఛాంబర్ లో ప్రమాణస్వీకారం చేయించిన వైనం తెలిసిందే.
తాజాగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో జకీయా ఖానం ఒకరు. ఆమె భర్త అబ్దుల్ ఆవాజ్ ఖాన్ మరణం నేపథ్యంలో ఆమెను ఎంపిక చేశారు. పార్టీ కోసం తన భర్త పడిన కష్టాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. పార్టీకి సేవ చేసిన నేత కుటుంబానికి పదవి ఇవ్వాలన్న ఆలోచనతో సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పక తప్పదు.
ఇదిలా ఉంటే.. జకియా ప్రమాణ స్వీకారంతోనే ఆమె ఒక అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ గవర్నర్ కోటాలో మైనార్టీ మహిళ ఒకరు ప్రమాణస్వీకారం చేయటం ఇదే తొలిసారి అంటున్నారు. ఇప్పటివరకు లేని రికార్డును నమోదు చేసుకున్న జకియా ఆనందంతో ఉక్కిబిక్కిరి అవుతున్నారు. పదవి రావటం ఒక ఎత్తు అయితే.. ఆ పదవితో అరుదైన రికార్డును సొంతం చేసుకోవటానికి మించింది ఇంకేం ఉంటుంది చెప్పండి.