Begin typing your search above and press return to search.

జీఎస్టీకి జైరాం పెట్టిన పేరు ఏంటంటే!

By:  Tupaki Desk   |   2 July 2017 4:41 AM GMT
జీఎస్టీకి జైరాం పెట్టిన పేరు ఏంటంటే!
X
ఇప్పుడు దేశంలో ఎక్క‌డ చూసినా వ‌స్తు - సేవ‌ల ప‌న్ను (జీఎస్టీ)కి సంబంధించిన చ‌ర్చ‌లే క‌నిపిస్తున్నాయి. మొన్న అర్ధ‌రాత్రి స‌మ‌యంలో పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్ వేదిక‌గా ఎన్డీఏ స‌ర్కారు జెండా ఊపిన జీఎస్టీ బిల్లుతో మ‌నకు లాభ‌మెంత‌?... లేదంటే న‌ష్ట‌మెంత‌?... అస‌లు ఏఏ వ‌స్తువుల ధ‌ర‌లు త‌గ్గుతాయి?... ఏఏ వ‌స్తువుల ధ‌ర‌లు పెరుగుతాయి? అన్న కోణాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌భుత్వం ఓ వైపున దీనికి సంబంధించి కాస్తంత వివ‌ర‌మైన ప్ర‌క‌ట‌న జారీ చేసినా... జ‌నంలో ఆందోళ‌న మాత్రం త‌గ్గ‌లేదు. జ‌నంలోని భ‌యాందోళ‌న‌ల‌ను ఆస‌రా చేసుకున్న విప‌క్ష పార్టీ కాంగ్రెస్... జీఎస్టీకి తెర తీస్తూ న‌రేంద్ర మోదీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించింది.

మొన్న‌టి జీఎస్టీ విందుకు ప్ర‌భుత్వం నుంచి ఆహ్వానం అందినా కూడా కాంగ్రెసోళ్లు ఒక‌ళ్లు కూడా ఆ ద‌రిదాపుల‌కే వెళ్ల‌లేదు. అయినా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్ర‌తిపాదించిన ఈ బిల్లును కాంగ్రెస్ పార్టే వ్య‌తిరేకించిన వైనంపై పెద్ద ఎత్తున క‌థ‌నాలు వ‌చ్చినా కూడా ఆ పార్టీ నేత‌లు విందుకు డుమ్మా కొట్టేందుకే తీర్మానించారు. అనుకున్న‌ట్లుగానే జీఎస్టీ విందుకు బంక్ కొట్టేసిన కాంగ్రెస్ నేత‌లు... జీఎస్టీపై వ్య‌తిరేక ప్ర‌చారం మొద‌లుపెట్టేశారు. ఈ క్ర‌మంలో ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర మాజీ మంత్రి జైరాం ర‌మేశ్ నిన్న జీఎస్టీపై విరుచుకుప‌డ్డారు. జీఎస్టీ వ‌ల్ల సామాన్యుడికేమీ లాభం లేద‌ని, ఈ కొత్త ప‌న్ను విధానంతో ప్ర‌భుత్వ ఖ‌జానా మాత్ర‌మే నిండుతుంద‌ని, స‌గ‌టు జీవికి ఇది మోయ‌లేని భారంగా మార‌నుంద‌ని తీవ్ర ఆవేద‌న‌తో పాటు ఆగ్ర‌హం కూడా వ్యక్తం చేశారు.

ఈ క్ర‌మంలో మోదీ జెండా ఊపిన జీఎస్టీకి ఆయ‌న ఓ నిక్ నేమ్ పెట్టేశారు. జీఎస్టీలోని ఒక్కో అక్షరానికి ఒక్కో ప‌దాన్ని ఆపాదించిన ఆయ‌న‌... *గ్రాండ్ సెల్ఫ్ ప్ర‌మోటింగ్ త‌మాషా* అని, *గ్రాండ్ సెల్ఫీ త‌మాషా* అని పేర్లు పెట్టేశారు. అంటే... జైరాం ఆరోప‌ణ‌ల ప్ర‌కారం జీఎస్టీ అంటే... కేవ‌లం మోదీ, ఆయ‌న స‌ర్కారు స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం, జ‌ల్సాల కోసం ప్ర‌వేశ‌పెట్టిన ప‌న్ను పేరే జీఎస్టీ అని అర్థ‌మ‌ట‌. మ‌రి ఇదే బిల్లును దివంగ‌త ప్ర‌ధాని రాజీవ్ గాంధీ హ‌యాంలోనే ప్ర‌తిపాదించార‌న్న విష‌యాన్ని జైరాం మ‌రిచిపోయిన‌ట్లున్నారు. అంటే నాడు అధికారంలో ఉండ‌గా జీఎస్టీని అమ‌ల్లోకి తీసుకురావాల‌ని కాంగ్రెస్ య‌త్నించి, నేడు బీజేపీ దానిని అమ‌ల్లోకి తీసుకురావ‌డాన్ని జీర్ణించుకోలేకే జైరాం ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా ఇట్టే అర్థం కాక మాన‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/