Begin typing your search above and press return to search.
రాజ కుటుంబం రోడ్డు మీదకు వచ్చింది
By: Tupaki Desk | 1 Sep 2016 12:45 PM GMTప్రజాస్వామ్య భారతంలో రాజ కుటుంబాలు కొన్ని ఉన్నాయి. వారికి ప్రత్యేక హోదా ఏమీ లేకున్నా.. వారిదైన జీవనాన్ని సాగిస్తుంటారు. సామాన్యులకు దూరంగా.. తమదైన లోకంలో ఉండేవారే ఎక్కువ. మరికొంతమంది అందుకు భిన్నంగా రాజకీయాల్లోకి వచ్చి.. సామాన్యులకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్య భారతంలో అందరూ ఒక్కటే అయినా.. రాజ కుటుంబానికి స్థానికంగా ఉండే ప్రజలు ఇచ్చే గౌరవ.. మర్యాదలు ఎక్కువగానే ఉంటాయి. దీనికి తోడు మారిన కాలానికి తగ్గట్లే.. రాజ కుటుంబీకులు సైతం తమ హద్దులు దాటకుండా వ్యవహరించటం కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా రాజస్థాన్ లోని ఒక రాజ కుటుంబం తమకు న్యాయం చేయాలంటూ తమ బంధుమిత్రులతో కలిసి రోడ్డు మీదకు వచ్చి నిరసన ప్రదర్శన నిర్వహించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమ రాజమహాల్ కు సంబంధించిన వ్యవహారంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై రాజమాతతో సహా ఆమె కుటుంబ సభ్యులు గుర్రుగా ఉన్నారు. రాజస్థాన్ తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నది వారి వాదన. ఇంతకీ ఈ రాజకుటుంబం ఏమిటి? వారికున్న సమస్య ఏమిటన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర విషయాలువస్తాయి. రాజస్థాన్ లోని జయపురలో ఉన్న సువిశాలమైన ప్యాలస్ మెయిన్ డోర్ ను ప్రభుత్వాధికారులు సీల్ వేశారు. ఈ వివాదంపై ప్రభుత్వానికి.. రాజకుటుంబానికి మధ్య గతంలోనే వివాదాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మొయిన్ డోర్ మూసేయటంపై రాజమాత పద్మినీ దేవి.. ఆమె కుమారుడు పద్మనాభ సింగ్ తో పాటు పలువురు రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ నిరసనలో పాల్గొన్నారు. రాజకుటుంబ సభ్యుల్లో కీలకమైన వారు తమకు న్యాయం చేయాలంటూ రోడ్ల మీదకురావటంతో స్థానిక ప్రజలు రాయల్ ఫ్యామిలీ వైపుతిరిగిన పరిస్థితి.
ఓపక్క రాజమాత తన సమస్యకు పరిష్కారం కోసం రోడ్ల మీదకు వస్తే.. రాజమాత కుమార్తె దియా కుమారి అధికార బీజేపీ ఎమ్మెల్యే కావటం గమనార్హం. అంతేకాదు.. రాజస్థాన్ రాష్ట్రముఖ్యమంత్రి వసుంధరా రాజెకు ఆమె సన్నిహితురాలు. రాజమాతకు.. ఆమె కుమార్తెకు మధ్య లెక్కలు సరిగా ఉంటే ఈ రోజు ఆమె రోడ్డు మీదకు రావాల్సిన అవసరమే ఉండేది కాదన్న మాట పలువురు నోట వినిపిస్తోంది. మరి.. దీనిపై రాజస్థాన్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో..?