Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ తో పాటూ ఆయన..కనుమరుగేనా?

By:  Tupaki Desk   |   16 Jun 2019 4:41 AM GMT
కాంగ్రెస్ తో పాటూ ఆయన..కనుమరుగేనా?
X
30ఏళ్లకు పైగా కాంగ్రెస్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఆ నేత ఇప్పుడు 2019 సార్వత్రిక ఎన్నికల వేళ సైలెంట్ అయ్యారు. ఎన్నో రాజకీయ ఎత్తుగడులు వేసి కేంద్రమంత్రి గా యూపీఎ హయాంలో చక్రం తిప్పిన తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ దారుణ ఓటమితో ఇక రాజకీయాలకు దూరం జరిగినట్టేనన్న చర్చ సాగుతోంది.

2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున కలలుగన్నారు. కేంద్రమంత్రిగా సోనియాకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న జైపాల్ రెడ్డి తెలంగాణ సీఎం సీటుపై కన్నేసి రాజకీయాలు చేశారు. జాతీయ స్థాయిలో - సోనియా వద్ద లాబీయింగ్ చేశారు. అయితే అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు కేంద్రంలో కాంగ్రెస్ కు చుక్కెదురు కావడంతో ఆయన ఆశలు గల్లంతయ్యాయి.

ఇప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్ అధ్యక్ష పదవినే రాహుల్ వద్దంటున్నారు. ఇక పార్టీ పదవుల్లోనూ ఆయన సీనియర్లను తొలగిస్తేనే తాను కొనసాగుతానంటున్నాడు. అందుకే జైపాల్ లాంటి సీనియర్లను తాజాగా కాంగ్రెస్ జాతీయ కమిటీల్లో చోటు ఇవ్వలేదు. ఇక రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.

దీంతో రెంటికి చెడ్డ రేవడిలా జైపాల్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటూ మహబూబ్ నగర్ జిల్లా నేతలతో సమీక్షలు చేస్తూ కాలం గడుపుతున్నాడట.. 2024 వరకు వయోభారం ఎక్కువై ఆరోగ్యం సహకరిస్తుందో లేదో.. సో జైపాల్ రెడ్డి రాజకీయ కెరీర్ ముగిసినట్టేనన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది.