Begin typing your search above and press return to search.
కేసీఆర్ దుబారా మనిషి: జైపాల్ రెడ్డి
By: Tupaki Desk | 3 Jun 2017 12:09 PM GMTతెలంగాణ కాంగ్రెస్ పెద్ద మనిషి, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. అధికారంలోకి రావడం కోసం ఆయన అడ్డగోలు హామీలన్నీ ఇస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాన్ని ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేస్తూ దుబారా చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా సచివాలయం కూల్చివేత ఆలోచన విరమించుకోవాలంటూ ఆయన సలహా ఇచ్చారు.
ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ తమకు సెక్రటేరియట్ కూడా లేదని ఏడుస్తున్నారని.. కానీ, ఉన్న సచివాలయాన్ని కూల్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని ఆయన మండిపడ్డారు. కొత్త సెక్రటేరియట్ వల్ల ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు. ప్రజలకు దీనివల్ల ఏ ఉపయోగం లేదని... కేసీఆర్ కు మాత్రం పండగ అని అన్నారు.
ఇదేసమయంలో ఆయన బీజేపీపైనా విమర్శలు చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జనజీవనం అతలాకుతలమైందని ఆయన అన్నారు. ప్రజలను ఈ విధంగా బాధించే అధికారం ఏ ప్రధానికీ లేదని చెప్పారు. ముడి చమురు ధర పెరిగిందనే కారణంతో ఎప్పటి కప్పుడు పెట్రోలు ధరలను పెంచుతున్నారని... ముడి చమురు ధరలు తగ్గినప్పుడు మాత్రం పెట్రోలు ధరలను తగ్గించడం లేదని మండిపడ్డారు. పెట్రోల్ ధరలను తగ్గించకపోవడం వల్ల కేంద్రానికి రూ. 20 వేల కోట్లు ఆదా అయిందని చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/