Begin typing your search above and press return to search.
కేసీఆర్ ను కడిగేసిన జైపాల్ రెడ్డి
By: Tupaki Desk | 3 Nov 2015 9:48 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయన కేసీఆర్ పట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆరెస్ రాజకీయాలను జూదంలా మార్చేసిందని ఆరోపించారు. కేసీఆర్ కాసినో పాలిటిక్స్ నడుపుతున్నారని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ కాంగ్రెస్ పక్షాన గాందీ భవన్ లో మాట్లాడిన ఆయన కేసీఆర్ అహంకారానికి వరంగల్ ఉప ఎన్నిక అద్దం పడుతుందని ఆయన అన్నారు. ఉప ఎన్నిక అవసరం ఎందుకు వచ్చిందో జనం గమనిస్తారని ఆయన అన్నారు. రాజకీయాలలో ఎవరూ చేయనన్ని వాగ్దానాలను కెసిఆర్ చేశారని, వాటిని అమలు చేయలేకపోతున్నారని జైపాల్ రెడ్డి విమర్శించారు.రిజర్వేషన్లు - రుణమాఫీ - ఇళ్ల నిర్మాణం వంటి విషయాలలో ఒక హేతుబద్దత లేకుండా కెసిఆర్ మాట్లాడుతున్నారని అన్నారు.
కాగా రాష్ట్ర విభజనకు ముందు కేంద్రంలో కీలకంగా వ్యవహరించిన జైపాల్ రెడ్డి కొద్దికాలంగా సైలెంటుగా ఉంటున్నారు. తెలంగాణ రాజకీయాలపై ఆయనేమీ మాట్లాడడం లేదు కూడా. ఇక్కడ పార్టీలో నాయకత్వ మార్పలు జరిగినా వాటినీ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు సడెన్ గా కేసీఆర్ పై మాత్రం విరుచుకుపడ్డారు. దీంతో జైపల్ మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలం అవుతున్నారనడానికి ఇది సంకేతమని చెబుతున్నారు.