Begin typing your search above and press return to search.

మోడీ ధైర్యం చేయ‌డు..కేసీఆర్ ఆపేయ‌డు

By:  Tupaki Desk   |   4 April 2018 5:58 AM GMT
మోడీ ధైర్యం చేయ‌డు..కేసీఆర్ ఆపేయ‌డు
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ - తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత - మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సెటైర్లు వేశారు. ప్ర‌ధాన‌మంత్రికి త‌న‌ను ప్ర‌శ్నించే వారిని ఎదుర్కునే దైర్యం చాల‌ద‌ని - కేసీఆర్‌ కు త‌నను పొగిడే వారికి నో చెప్పేందుకు సిద్ధ‌ప‌డ‌ర‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తిరుపతి వెంకన్న కంటే సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు ఎక్కువగా పాలాభిషేకాలు చేస్తున్నారని అన్నారు. ఈ విష‌యం తెలిసినా కేసీఆర్ నిలువ‌రించ‌లేని బ‌ల‌హీన‌త‌తో ఉన్నార‌న్నారు. కేసీఆర్‌ అధికార మదాన్ని ప్రజలు త్వరలోనే దింపేస్తారని జైపాల్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీతో కేసీఆర్‌ కుమ్ముక్కై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో ఓ మాట - హైదరాబాద్‌ లో మరో మాట మాట్లాడుతున్నారని అన్నారు. లాటిన్‌ అమెరికాలో అప్పులు చేసినందుకు అభిశంసన తీర్మానంతో అక్కడి ప్రధానిని పదవి నుంచి పార్లమెంట్‌ దింపేసిందన్నారు. తెలంగాణలోనూ లేని ఆస్తులు చూపించి అప్పులు చేస్తున్న సీఎం కేసీఆర్‌ నూ గద్దె దింపాలన్నారు. ప్రాజెక్టులు - మిషన్‌ భగీరథ పేరిట విచక్షణారహితంగా అప్పులు తెచ్చి రుణగ్రస్త తెలంగాణగా మార్చారని విమర్శించారు. కేసీఆర్‌ అధికార మదాన్ని ప్రజలు త్వరలోనే దింపేస్తారని హెచ్చరించారు. బీజేపీతో కేసీఆర్‌ కుమ్ముక్కై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో ఓ మాట - హైదరాబాద్‌ లో మరో మాట మాట్లాడుతున్నారని అన్నారు.

ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని బీజేపీ మనసులో ఉందని, కానీ ధైర్యం చేయలేకనే సుప్రీంకోర్టు సవరణలు చేసేలా చేసిందని ఎస్.జైపాల్‌ రెడ్డి ఆరోపించారు. దళితులను అణచివేయడమే బీజేపీ ఆలోచనా విధానమని, అందుకే ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ కేసును నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. పార్లమెంట్‌ చేయాల్సిన చట్ట సవరణలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి బీజేపీ పరిపాలనా లోపాలే కారణమన్నారు. అందుకే ఎస్సీ - ఎస్టీల రక్షణకు తెచ్చిన చట్టానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. బీజేపీ మనసులో ఉన్న ఆలోచనను సుప్రీం కోర్టు ద్వారా చేయిస్తున్నారని జైపాల్ రెడ్డి విమర్శించారు. సుప్రీంకోర్టు చట్టంలో మార్పులు తేవడానికి ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. పార్లమెంటు చేయాల్సిన చట్ట సవరణలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడం కూడా వారి వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఎస్సీ - ఎస్టీల రక్షణకు తెచ్చిన చట్టాన్ని తూట్లు పొడిచే ప్రయత్నం చేసినట్లు తేటతెల్లమైందని అన్నారు. ఈ విషయంలో ఇప్పటికీ ప్రధాని మోడీ నోరుమెదపకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రధాని మోదీ అసమర్ధత వల్లనే ఇలా జరిగిందని, మేము అధికారంలో ఉంటే ఇలా జరిగేది కాదని తెలిపారు.

తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండరాం ఉద్యమంలో చేసిన పాత్ర ఎనలేనిదని, ఆయన కొత్త పార్టీ గురించి ఇప్పుడే తానేం చెప్పలేనని జైపాల్ రెడ్డి అన్నారు. తమ బస్సు యాత్ర ఫెయిల్‌ అయిందని టీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడటం వాళ్ల ఆత్మ సంతప్తికి నిదర్శనమన్నారు. తమ నాయకున్ని హైకమాండే నిర్ణయిస్తుందని, అందుకు తామంతా కట్టుబడి ఉన్నామని చెప్పారు.