Begin typing your search above and press return to search.

భ‌ర్త మ‌ద్యం సేవిస్తే భార్య‌కు ఫైన్‌!

By:  Tupaki Desk   |   31 July 2016 7:50 AM GMT
భ‌ర్త మ‌ద్యం సేవిస్తే భార్య‌కు ఫైన్‌!
X
మద్యపాన నిషేధం హామీతో గ‌ద్దెనెక్కిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ త‌న మాట‌ను క‌ఠినంగా అమ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో భర్త మద్యపానం చేస్తే భార్యను కూడా విచార‌ణ చేసే విధంగా ఒక బిల్లును నితీశ్ ప్ర‌భుత్వం రూపొందించింది. త‌ద్వారా ఇంట్లో ఒకరు ఆల్కహాల్ తాగినా - తయారు చేసినా - విక్రయించినా ఆ ప్రభావం కుటుంబం మొత్తంపై పడనుంది. నితీశ్ నిర్ణ‌యంపై ఆ రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

బీహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బిల్లు 2016తో అక్కడ మద్యపాన నిషేధాన్ని పక్కాగా అమలు చేయనుంది. దీని ప్రకారం కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరికీ ఇంటి పరిసరాల్లో మద్యపానం - తయారీ - విక్రయం నేరమని తెలిసి ఉండాలి. తరచూ ఒకే ప్రదేశంలో మద్యపాన నిషేధ ఉల్లంఘన జరుగుతుంటే ఆ ఊరికి లేదా పట్టణానికి మొత్తానికి జరిమానా విధించాలనే నిబంధ‌నను కూడా దీనిలో పొందుపర్చారు. ఇది మద్యపాన నిషేధంపై ఊరికి సమష్టి బాధ్యతను అప్పగిస్తుంది. అప్పుడే ఈ బిల్లుపై స్వపక్షం.. విపక్షం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఆర్‌ జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ దీనిపై మాట్లాడుతూ ఇటువంటి నిబంధనలు ఉన్న విషయం తనకు తెలియదన్నారు.దీనిపై ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ తో మాట్లాడ‌తానని చెప్పారు. కుటుంబంలో ఒకరు తప్పు చేస్తే అందరినీ బాధ్యులను చే యడం సరికాదన్నారు. ఈ బిల్లుని ప్ర‌తిప‌క్ష‌మైన బీజేపీ కూడా వ్యతిరేకిస్తోంది.