Begin typing your search above and press return to search.
జై జనసేన....మంత్రి గుడివాడ ఇరుక్కున్నారా...?
By: Tupaki Desk | 6 April 2023 8:03 PM GMTరాజకీయాల్లో ఎపుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రతీ ఒక్క సంఘటన కూడా ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతూ ఉంటుంది. చివరికి అది బిగ్ ట్రబుల్స్ ని కూడా తెస్తుంది. విషయానికి వస్తే విశాఖ జిల్లాకు చెందిన యువ మంత్రి గుడివాడ అమరనాధ్ ఇపుడు విపక్షాలకు కార్నర్ అయ్యారు. దానికి కారణం జై జనసేన నినాదం.
మంత్రి అనకాపల్లిలో జరిగిన బాబూ జగజ్జీవన్ రాం జయంతి వేళ సభ నిర్వహిస్తుండగా అక్కడ సమీపంలో ఉన్న ఒక కళాశాల విద్యార్ధి జై జనసేన అని నినాదాలు చేశారు. దాంతో ఆగ్రహించిన మంత్రి వెంటనే పోలీసులను పంపించి యాక్షన్ తీసుకోమన్నారు. అది కాస్తా అతి పెద్ద రాజకీయ వివాదం అయింది. జనసేన నాయకులు అయితే విశాఖలో ఆందోళన కార్యక్రమం నిర్వహించి మరీ మంత్రిని క్షమాపణలు చెప్పాలని కోరారు.
జై జనసేన అంటే మంత్రికి ఎందుకు అంత ఉలుకు అని వారు ప్రశ్నించారు. విద్యార్ధి అలా అన్నందుకు పోలీసులను పెట్టించి కొట్టిస్తారా అని నిలదీస్తున్నారు. జనసేన అంటే మంత్రికి వెన్నులో వణుకు మొదలైందని, ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎన్నికల్లో యువత ఓడించిందని దాంతోనే ఇలా చేస్తున్నారు అని వారు విమర్శించారు.
జై జనసేన అంటే విద్యార్ధికి పోలీసులతో కొట్టిస్తారా అని తెలుగుదేశం సహా ఇతర విపక్షాలు మంత్రి మీద దండెత్తుతున్నాయి. వివాదం బాగా ముదరడంతో ఎట్టకేలకు మంత్రి గారు వివరణ ఇచ్చుకోక తప్పింది కాదు. తాను విద్యార్ధిని కొట్టించమని పోలీసులని పంపలేదని అన్నారు. ఒక జాతీయ నాయకుడిని నివాళి అర్పిస్తున్న సమయంలో క్రమశిక్షణా రాహిత్యంతో ఆ విద్యార్ధి జై జనసేన అని ఒకటికి పదిసార్లు నినాదాలు చేసి సభను డిస్టర్బ్ చేశారని అన్నారు.
ఇది మంచి విధానం కాదని జాతీయ నేతను అంతా గౌరవించుకోవాల్సి ఉందని ఆ సమయంలో ఈ తరహా రాజకీయ నినాదాలు తెలిసో తెలియకో చేస్తే కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయమని తాను పోలీసులకు చెప్పానని ఇందులో తప్పేముందని ఆయన అంటున్నారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు చెందిన కళాశాల విద్యార్ధి కావడం వల్లనే ఇలా చేశారని మరో వైపు విమర్శలు వస్తున్నాయి.
ఈ మధ్య మాజీ మంత్రికి అమర్ నాధ్ కి మధ్య అసలు పడడం లేదని అంటున్నారు. దాంతోనే ఇలా చేశారని కూడా చెబుతునారు. అయితే దీని మీద మాట్లాడిన మంత్రి అమర్ తాను మాజీ మంత్రి దాడి కుటుంబ సభ్యుడిని అని తమదంతా ఒకే ఫ్యామిలీ అని అన్నారు. దాడి కళాశాల అయినా అది తన సొంత కళాశాల లాంటిదే అన్నారు. ఇక విద్యార్ధి తప్పు చేస్తే సొంత కళాశాల అయినా చర్యలు తీసుకోకుండా ఉండగలమా అని ప్రశ్నించారు.
మొత్తం మీద చూస్తే గుడివాడ నలువైపుల నుంచి విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఒంటికాలి మీద లేస్తారు. దాంతో ఆ పార్టీ గుడివాడను టార్గెట్ చేస్తోంది. మరో వైపు సొంత పార్టీ వైసీపీలోనూ మాజీ మంత్రితో పడకుండా ఉంది. దాంతో మంత్రిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. తెలుగుదేశం నుంచి ఎటూ పోటీ ఉంది. ఈ పరిణామాల నేపధ్యంలో మంత్రి గుడివాడ ముప్పేట దాడితో సతమతమవుతున్నారని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.