Begin typing your search above and press return to search.

ఐపీఎల్ వేలంలో అందరినీ ఆకర్షించిన అందాల భామ ఎవరో తెలుసా?

By:  Tupaki Desk   |   14 Feb 2022 1:30 AM GMT
ఐపీఎల్ వేలంలో అందరినీ ఆకర్షించిన అందాల భామ ఎవరో తెలుసా?
X
ఐపీఎల్ 2022 మెగా వేలం ముగిసింది. ఈ ఏడాది భారత్‌లో అతిపెద్ద క్రికెట్ సీజన్ ఐపీఎల్ కోసం పూర్తిస్థాయి వేలం జరిగింది. గత సంవత్సరం సగం సీజన్ భారతదేశంలో జరిగింది.. మిగిలిన సగం సీజన్ యూఏఈలో జరిగింది. ప్రేక్షకుల హాజరు లేకుండానే ఈ ఏడాది ఐపీఎల్‌ భారత్‌లో జరుగుతుందని బీసీసీఐ ధృవీకరించింది. ఇదిలా ఉండగా వేలం పాటలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి.

మొత్తం పది మంది ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ ను 15 కోట్లకు పైగా వెచ్చించి ముంబై కొనుగోలు చేసింది.వేలంలో ఇదే అత్యధిక మొత్తం కావడం గమనార్హం. అనంతరం శ్రేయాస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 12.25 కోట్ల రూపాయలకు పట్టుకుంది. రవిచంద్రన్ అశ్విన్ 5 కోట్ల రూపాయలకు తీసుకున్నాడు. డేవిడ్ వార్నర్ ఢిల్లీకి 6 కోట్లకే అమ్ముడు పోవడం షాకింగ్ గా మారింది.ఈ సంవత్సరం, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రెండు కొత్త జట్లు గుజరాత్, లక్నో చోటు చేసుకోనున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‌లో మొత్తం పది జట్లు తలపడనున్నాయి.

ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ టేబుల్ వద్ద గ్లామర్ ఉట్టిపడింది. ఐపీఎల్ వేలంలో అందరినీ ఆకర్షించిన అందాల భామ ఎవరో కాదు ‘జాహ్నవి మెహతా’. ఈమె ఎవరో కాదు.. జూహ్లీ చావ్లా కూతురు కావడం విశేషం.

ఇక తనతోపాటు కోల్ కతా ప్రాంఛైజీ సహ యజమాని తనయుడు ఆర్యన్, కుమార్తె సుహానా వేలం పాటలో పాల్గొన్నారు. అయితే వీరిద్దరినీ మించి ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. కాస్త చామనచాయగా ఉన్న ఈ అందాల కలువ జాహ్నవి 2019లో విదేశాల్లో డిగ్రీ పూర్తి చేసింది. జాహ్నవి ఐపీఎల్ వేలంలో పాల్గొనడం ఇదేమీ తొలిసారి కాదు.. రెండేళ్ల కిందట కూడా ఆటగాళ్ల వేలంలో తళుక్కుమంది.

తల్లి జూహ్లీ చావ్లా తోడు లేకుండానే కోల్ కతా నైట్ రైడర్స్ వేలంలో ఎంతో చురుకుగా వ్యవహరించింది. కేకేఆర్ ఫ్రాంఛైజీ సీఈవో వెంకీ మైసూర్ పర్యవేక్షణలో తమ జట్టు కోసం కొనుగోళ్లు జరపడంలో జాహ్నవి కూడా తన వంతు పోషించింది. కెమెరాలన్నీ ఈ వేలంలో ఆమెపైనే ఫోకస్ చేశాయి.